శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2016 (13:14 IST)

గర్భవతులు మొక్కజొన్న తింటే మంచిదా? తింటే ఫలితం ఏమిటి?

మొక్కజొన్నల్ని వానాకాలంలో తీసుకోవడం ద్వారా.. ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుతుంది. కార్న్ గింజల్ని గ్రేవీలో వేసి ఫ్రైడ్‌రైస్‌తో కలిపి తినవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటి వాటితో కూడా చేర్చి సాయంకాలం వేళ

మొక్కజొన్నల్ని వానాకాలంలో తీసుకోవడం ద్వారా.. ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుతుంది. కార్న్ గింజల్ని గ్రేవీలో వేసి ఫ్రైడ్‌రైస్‌తో కలిపి తినవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటి వాటితో కూడా చేర్చి సాయంకాలం వేళ స్నాక్స్‌గా కూడా లాగించేయొచ్చు. మొక్కజొన్న పొత్తులను సాధారణంగా నిప్పులపై వేడిచేసి బాగా కాలిన తర్వాత తింటారు. ఎలా తిన్నా మొక్కజొన్న రుచికి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. 
 
మొక్కజొన్నలో పీచు పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. అవి జీర్ణకియకు బాగా తోడ్పడతాయి. పేగు క్యాన్సర్‌ను కూడా నివారిస్తుంది. మొక్కజొన్న గింజలు చాలా బలవర్ధకమైన ఆహారం. చాలా చౌకగా లభిస్తాయి. దీంట్లో ఉండే లవణాలు, విటమిన్లు.. ఇన్సులిన్‌పై ప్రభావం చూపిస్తాయి. మధుమేహం ఉన్నవారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఫోలిక్ యాసిడ్ పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల మొక్క జొన్న గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. వారి క‌డుపులోని బిడ్డ‌కు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవ‌స‌రం. కాబ‌ట్టి మొక్క‌జొన్న‌ల‌ను గ‌ర్భిణీలు తింటే పుట్ట‌బోయే పిల్ల‌ల‌కు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రావు.
 
మొక్క‌జొన్నలో ఫ్లేవ‌నాయిడ్స్ అని పిల‌వ‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. దీంతో ఇవి శ‌రీరంలో ఏర్ప‌డే ఫ్రీ ర్యాడిక‌ల్స్ ప్ర‌భావాన్ని త‌గ్గిస్తాయి. ఈ కార‌ణంగా క్యాన్స‌ర్లు రావు. ట్యూమ‌ర్లు కూడా పెర‌గ‌వు. బీటా కెరోటిన్‌, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండ‌డం వ‌ల్ల మ‌నం చ‌ర్మానికి సంర‌క్ష‌ణ క‌లుగుతుంది. చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. చ‌ర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
 
జింక్‌, పాస్ఫ‌ర‌స్‌, మెగ్నిషియం, ఐర‌న్‌లు, ఇత‌ర మిన‌రల్స్ మొక్క‌జొన్న‌లో ఉంటాయి. దీని వ‌ల్ల ఇవి మ‌న ఎముక‌ల‌కు బ‌లాన్నిస్తాయి. ఎముక‌ల‌కు దృఢ‌త్వం క‌లుగుతుంది. కీళ‌నొప్పులతో బాధ ప‌డేవారు మొక్క‌జొన్న‌ల‌ను త‌మ ఆహారంలో భాగం చేసుకుంటే స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మొక్క‌జొన్న‌ల్లో ఐర‌న్ పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతోపాటు ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తికి ఉప‌యోగ‌ప‌డే ఫోలిక్ యాసిడ్ కూడా మొక్క‌జొన్న‌ల్లో అధికంగానే ఉంటుంది.