శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2017 (15:57 IST)

మెదడు చురుగ్గా పనిచేయాలా? జుట్టు రాలకుండా ఉండాలా? ఖర్జూరాలు తినండి..

మెదడు చురుగ్గా పనిచేయాలంటే రోజూ ఖర్జూరాలు తినాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నరాలకు బలం చేకూర్చడంతో పాటు మెదడును చురుకుగా ఉంచే గుణాలు ఖర్జూర పండ్లలో పుష్కలంగా ఉన్నాయి. జ్ఞాపకశక్తిని పెంపొందింపజేయ

మెదడు చురుగ్గా పనిచేయాలంటే రోజూ ఖర్జూరాలు తినాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నరాలకు బలం చేకూర్చడంతో పాటు మెదడును చురుకుగా ఉంచే గుణాలు ఖర్జూర పండ్లలో పుష్కలంగా ఉన్నాయి. జ్ఞాపకశక్తిని పెంపొందింపజేయడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను ఇది దూరం చేస్తుంది. అందుకే రోజుకు రెండేసి ఖర్జూరాలను తీసుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
ఐరన్ లోపంతో బాధపడే వారు ఖర్జూరాలను తప్పకుండా తీసుకోవాలి. ఖర్జూరాల్లోని సల్ఫర్ శరీరంలో ఏర్పడే అలెర్జీలను దూరం చేస్తుంది. ఇందులోని నికోటిక్ పేగుల్లో వ్యాధులకు కారకాలైన క్రిములను నశింపజేస్తుంది. తద్వారా పేగు సంబంధిత రుగ్మతల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇందులోని అమినో ఆమ్లాలు, ఫైబర్ జీర్ణకోశ సమస్యలను నయం చేస్తుంది. 
 
ఖర్జూరంలో క్యాల్షియం, సల్ఫర్, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం వంటి ధాతువులు రక్తహీనతకు చెక్ పెడుతుంది. అందుకే రోజుకు రెండేసి ఖర్జూరాలను తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. అలాగే ఎముకలు బలపడతాయని, జుట్టు రాలడాన్ని నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.