విసుక్కుంటున్నారా..? అయితే నిల్చున్న చోటే 20సార్లు జాగింగ్ చేయండి
ప్రతి రోజూ పనులతో సతమతమవుతుంటాం. తీరికలేక విసుగుతో ఎదుటి వారిని కూడా విసుక్కుంటుంటాం. కాని ఉదయం నిద్ర లేవగానే కాస్త వ్యాయామం చేస్తే ఆ విసుగు దూరమై కాస్త ఊరట కలుగుతుంది మనస్సుకు. ఇంతే కాకుండా వ్యాయామం చేయడం కూడా ఓ కళే అంటున్నారు వ్యాయామ నిపుణులు. ఆ వ్యాయామాలు కూడా మనకు ఎంతో లాభదాయకంగా వుంటాయంటున్నారు వారు. అవేంటో తెలుసుకుందాం...
తలకు మసాజ్.. తలను ముందుకు, వెనుకకు, కుడివైపుకు, ఎడమవైపుకు, చేతివేళ్లతో మసాజ్ చేసుకోవాలి. ఇలా తల భాగంనుండి మెడ భాగం వరకు మనకు ఒళ్లు జలధరింపు వచ్చే వరకు మసాజ్ చేస్తుండాలి. దీంతో నరాలు నిస్సత్తువను వదిలి ఉత్సాహంగా ఏ పని చేయడానికైనా రెడీ అంటారు.
జాగింగ్.. మీరు నిల్చున్న చోటే 20 సార్లు జాగింగ్ చేయాలి. తర్వాత కుడి కాలును, ఎడమ కాలును ముందుకి వెనక్కి విసిరేస్తున్నట్లు కనీసం 40నుండి 50 సార్లు చేయాలి. దీనివలన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి మీలోవున్న అలసట దూరమౌతుంది. భుజాలు..మీ మోచేతుల్ని మడిచి వేళ్ళను భుజాలపైకి తీసుకురావాలి. వాటిని ముందుకు, వెనుకకు కనీసం ఐదు సార్లు తిప్పాలి.
వెన్నెముకను వంచి..మీ కాళ్ళను దూరంగా పెట్టి నిల్చోవాలి. మీ కుడి చేతిని తలపైకి నిటారుగా వుంచి వీలైనంతమేర మీ ఎడమ వైపుకు వంగాలి. ఇలా కనీసం 25 సార్లు చేయాలి. అలాగే ఎడమ చేతిని పైకి చాచి కుడివైపుకి వంగాలి. ప్రతిరోజు ఇలా చేస్తే కనీసం అరగంట మాత్రమే సమయమౌతుంది.కాబట్టి సమయం లేదనకుండా ఉదయం నిద్ర లేవగానే ఇలా చేస్తే ఆరోగ్యం మీ వెంటే కదా.. మరి ఆలస్యం దేనికి.