శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 17 డిశెంబరు 2018 (19:10 IST)

ఆరోగ్య.. ఆహార నియమాలు..?

ఆరోగ్యవంతమైన జీవితాన్ని సొంతం చేసుకోవాలంటే.. ఇలా చేయాలని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంటే.. భోజనానికి ముందు భోజనానికి తరువాత ఎలాంటి పదార్థాలు తీసుకోవాలనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. అవేంటో చూద్దాం.
 
1. దేశ - కాలాదులకు అనుగుణంగా సంతృప్తికరమైన ఆహారమును రోజుకు రెండువేళలందు మాత్రమే భుజించాలి. అవి.. పగలు, రాత్రి. త్రేనుపు సులువుగా కలుగుట, మలమూత్రములు సాఫీగా పోవుట, ఆకలిదప్పులు కలుగుట అనే లక్షణాలు ఆహారం బాగా జీర్ణమైన వానిలో కలుగుతాయి. 
 
2. బంగారు పాత్రలో భోంచేయు వారికి సకల దోషాలు హరించును. వెండి పాత్రములో భోంచేయు వారికి నేత్ర వ్యాధులు వచ్చే అవకాశాలు లేవు. పిత్త వ్యాధులు దరిజేరవు.
 
3. భోజనం చేసే ప్రతిసారీ.. కొంచెం అన్నంలో అల్లం, సైంధవ లవణం కలిపి తినుట చాలా ఆరోగ్యకరం. అన్నం మీద అయిష్టతను, అరుచిని పోగొట్టి.. ఆకలిని వృద్ధిచేస్తుంది. నాలుకను, కంఠమును శుద్దిచేస్తుంది. 
 
4. భోజనం చేయడానికి ముందు.. ఫలంలో దానిమ్మ ఫలం తినవచ్చును. అరటిపండు, దోసపండు తినకూడదు. వీటిని భోజనాంతరం తినవచ్చును.
 
5. తామరకాడలు, తామర తూడులు, తామరగడ్డలు, చెఱకు మొదలగు వాటిని భోజనమునకు ముందే భుజించాలి. భోజనానంతరం తినకూడదు. భోజన సమయంలో గట్టి పదార్థాలను ముందు తరువాత మృదుపదార్థాలను, చివరిలో ద్రవపదార్థాలను తీసుకొనుట మంచిది. బలం కలుగుతుంది. 

6.  కఫ, వాత వ్యాధులుండే వారు మాత్రం వెండిపాత్రలో భోజనం చేయరాదు. ఇత్తడి పాత్రలో భోజనం చేయుట వలన క్రిములు నశించును. కఫ వ్యాధులను నివారించును. శోష, పాండు రోగములను అరికట్టును. శరీరానికి బలాన్ని చేకూర్చును.