ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (12:07 IST)

అమ్మాయిలూ రోజూ అరకప్పైనా పెరుగు తీసుకోండి..

అమ్మాయిలు, అబ్బాయిలు రోజుకు అరకప్పైనా పెరుగు తీసుకోవాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. బరువు పెరుగుతారని పెరుగు తీసుకోకపోడం సరికాదు. పెరుగు తీసుకుంటే బరువు పెరుగుతామనేది కేవలం అపోహ మాత్రమే. ఇందులో

అమ్మాయిలు, అబ్బాయిలు రోజుకు అరకప్పైనా పెరుగు తీసుకోవాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. బరువు పెరుగుతారని పెరుగు తీసుకోకపోడం సరికాదు. పెరుగు తీసుకుంటే బరువు పెరుగుతామనేది కేవలం అపోహ మాత్రమే. ఇందులోని పోషకాలు బరువును తగ్గిస్తాయి. అధిక మోతాదులో క్యాల్షియం అందించే పెరుగును రోజూ అరకప్పైనా తీసుకోవాలి. 
 
పెరుగును తీసుకోవడం ద్వారా శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లను అదుపులో ఉంచుతుంది. పైగా డైటరీ ఫ్యాట్‌ గ్రహించుకోవడాన్ని కూడా తగ్గిస్తుంది. ఫలితంగా ఆకలి అదుపులో ఉంటుంది. రోజులో కనీసం అరకప్పు పెరుగు తినడం వల్ల దానిలోని క్యాల్షియం శరీరంలోని కొవ్వుకణాలను బయటకు పంపిస్తుంది. అదేవిధంగా అమినో ఆమ్లాలు కొవ్వును కరిగిస్తాయి. 
 
వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. పెరుగులో అధికమోతాదులో పొటాషియం, ఫాస్పరస్, రైబోఫ్లేవిన్ వంటి పోషకాలుంటాయి. ఇందులోని మాంసకృత్తులూ, అమినో ఆమ్లాలూ అధిక బరువును అదుపులో ఉంచేందుకు సాయపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.