1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 26 మార్చి 2024 (15:15 IST)

సమ్మర్‌లో వచ్చే తాటి ముంజలు ఎందుకు తినాలో తెలుసా?

Palm fruit
తాటి ముంజలు. వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజలు. అంతేకాదు వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి, అవేమిటో తెలుసుకుందాము.
 
తాటి ముంజలులో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి.
ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి.
ముంజల్లో పొటాషియం వుండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.
శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది.  
తాటిముంజల్ని తీసుకోవడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు.
తాటి ముంజలు తినడం వలన చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.
ముంజలు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తాయి.
వేసవిలో వచ్చే చికెన్ పాక్స్‌ని నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.