మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 22 అక్టోబరు 2017 (14:42 IST)

లైంగిక సామర్థ్యాన్ని పెంచే దానిమ్మ పండు..

దానిమ్మలో శరీరానికి కావలిసిన శక్తినిచ్చే పోషకాలు పుష్కలంగా వున్నాయి. దానిమ్మ పండును రోజు వారీగా అరకప్పు తీసుకుంటే రక్తహీనతకు చెక్ పెట్టవచ్చును. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ దానిమ్మలో పీచుపదార్థాలు అధి

దానిమ్మలో శరీరానికి కావలిసిన శక్తినిచ్చే పోషకాలు పుష్కలంగా వున్నాయి. దానిమ్మ పండును రోజు వారీగా అరకప్పు తీసుకుంటే రక్తహీనతకు చెక్ పెట్టవచ్చును. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ దానిమ్మలో పీచుపదార్థాలు అధికంగా ఉన్నాయి. శరీరానికి కావాల్సిన విటమిన్ ఎ, సి, ఇ లను దానిమ్మ అందజేస్తుంది.
 
అలాగే హృద్రోగ సమస్యలను దానిమ్మతో అడ్డుకోవచ్చు. దానిమ్మ పండ్లను అరకప్పు తీసుకోవడం ద్వారా చెడు కొవ్వు పదార్థాలు కరిగిపోతాయని, ఊబకాయాన్ని నియంత్రించుకోవచ్చు. అంతేగాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మ సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. 
 
ఎముకల ఆరోగ్యానికి దానిమ్మ చాలా మేలు చేస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడే వారికి అత్యంత దివ్యమైన ఔషధం దానిమ్మ. లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. సంతాన సాఫల్యతను పెంచే శక్తి దీనికి ఉంది. 
 
గర్భస్థ శిశువుల పెరుగుదలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణీ మహిళలు రోజూ ఒక గ్లాస్ దానిమ్మ రసం తీసుకుంటే ఎంతో మంచిది. దీని వల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు తప్పుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.