అసలు సంతానలేమికి కారణాలేమిటి?

సంతానలేమి బాధేమిటో ఆ దంపతులకే తెలుస్తుంది. కాకపోతే తమ లోపాలేమిటో తెలుసుకునే విషయంలో చాలామంది దంపతులు బాగా ఆలస్యం చేస్తారు. అందుకు గల కారణాలను తెలుసుకుని సరైన వైద్యుడ్ని సంప్రదించాలి. సంతానం కలగడంలో స్థూలకాయం పెద్ద అవరోధంగా ఉంటుంది. శరీరం బరువు పెరిగ

Written By chj
Updated: బుధవారం, 25 జనవరి 2017 (17:25 IST)
సంతానలేమి బాధేమిటో ఆ దంపతులకే తెలుస్తుంది. కాకపోతే తమ లోపాలేమిటో తెలుసుకునే విషయంలో చాలామంది దంపతులు బాగా ఆలస్యం చేస్తారు. అందుకు గల కారణాలను తెలుసుకుని సరైన వైద్యుడ్ని సంప్రదించాలి.
 
సంతానం కలగడంలో స్థూలకాయం పెద్ద అవరోధంగా ఉంటుంది. శరీరం బరువు పెరిగిపోయినప్పుడు హర్మోన్ సంబంధిత మార్పులు వస్తాయి. ప్రత్యేకించి గొనాడో ట్రోఫిన్ రిలీజింగ్ హర్మోన్ వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు.
 
మద్యం మరియు పొగాకు వల్ల ఎర్రరక్తకణాలు తగ్గిపోయి శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుంది. ఇది కూడా సంతాన లేమికి కారణమవుతుంది. కొందరిలో వంశానుగతంగా కూడా వీర్యకణాలు తగ్గిపోయో పరిస్థితి ఉంటుంది. మరికొందరిలో డిఎన్‌ఏ దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.
 
ఎక్కువ గంటలు సైకిల్ తొక్కడం, గుర్రపు స్వారీ చేయడం, అధిక ఉష్టోగ్రతలో పనిచేయడం, ఎక్కువ గంటలు కంప్యూటర్ల ముందు కూర్చోవడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. వృషణాల్లోంచి పురుషాంగంలోకి వచ్చే మార్గంలో ఏర్పడే అడ్డంకుల వల్ల అంటే వ్యాన్ డిఫరెన్స్ ఆబ్‌స్ట్రక్షన్, ల్యాక్ ఆఫ్ వ్యాస్ ఢిఫరెన్స్ వంటి సమస్యలు కూడా సంతానలేమికి కారణమవుతాయి. శీఘ్రస్థలన సమస్యకూడా ఇందుకు కారణమే.
 
పైన తెలిపిన కారణాలే కాకుండా వీర్యకణాల సామర్థ్యాల మీద సంతానం విషయం ఆధారపడి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా అసలే వీర్యకణాలు లేకపోవడం, వీర్యకణాల సంఖ్య అవసరమైనంత లేకపోవడం, వీర్యకణాల్లో స్త్రీ అండాశయంలోకి దూసుకువెళ్లే చలన శక్తి లేకపోవడం ఇవన్నీ కారణాలే.

అన్నీ చూడండి

Gen Z: 21 ఏళ్లలోనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో యువత పోటీ.. జెన్-జెడ్‌కు రేవంత్ మద్దతు (video)

Kazipet: కాజీపేట-విజయవాడ మధ్య ట్రిపుల్ లైన్ ప్రాజెక్టు పనులు పూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో శనివారం కొత్త పది కోవిడ్ కేసులు నమోదు

భారతదేశంలోని వృద్ధుల కోసం మూడు కొత్త ఆవిష్కరణలు: అన్వయా కిన్ కేర్

జంతర్ మంతర్ వద్ద సంబరాలు.. నన్ను హీరోను చేయకండి.. ఇంతటితో ఆగిపోలేదు.. (video)

అన్నీ చూడండి

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

Jai Krishna: కొన్ని చోట్ల అలా అనిపించొచ్చు, వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి ఉంది : జై కృష్ణ ఘట్టమనేని

Rohit Nara : వినికిడి లోపం గల సౌండ్ ఇంజినీర్ గా రోహిత్ నారా టైటిల్ ప్రకటన

Surya and Mamitha Baiju : ది వెడ్డింగ్ సాంగ్ లో ఆడి పాడిన సూర్య, మమితా బైజు

తర్వాతి కథనం
Show comments