Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెపటైటిస్ బి వ్యాధి చాలా డేంజర్... తెలుసుకోవడం చాలా ముఖ్యం... వివరంగా...

హెపటైటిస్ బి ద్వారా పచ్చ కామెర్ల వ్యాధి రాకూడదు. వస్తే ఇది ప్రాణాంతకమైన వ్యాధిగా మారిపోతుంది. ఈ వ్యాధి బారిన పడినవారికి నలువైపులా పసుపుపచ్చగానే కనపడుతుంది. వ్యాధిగ్రస్తుడు కూడా పసుపుపచ్చగా మారే ప్రమాద

Written By ivr
Updated: బుధవారం, 31 ఆగస్టు 2016 (15:14 IST)
హెపటైటిస్ బి ద్వారా పచ్చ కామెర్ల వ్యాధి రాకూడదు. వస్తే ఇది ప్రాణాంతకమైన వ్యాధిగా మారిపోతుంది. ఈ వ్యాధి బారిన పడినవారికి నలువైపులా పసుపుపచ్చగానే కనపడుతుంది. వ్యాధిగ్రస్తుడు కూడా పసుపుపచ్చగా మారే ప్రమాదం ఉంది. బలహీనంగా తయారవుతారు. దీనినే హెపటైటిస్ బి అనే పేరుతో పిలుస్తారు.
 
హెపటైటిస్ బి అనేది డీఎన్ఏ వైరస్‌తో సంక్రమించే వ్యాధి. ఇది ఒకరి అపరిశుభ్రమైన రక్తం మరొకరికి ఎక్కిస్తే ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడినవారు దాదాపు 40 కోట్లకు పైగానే ఉంటారని అంచనా. ముఖ్యంగా భారతదేశంలో దాదాపు 4.5 కోట్లమంది ప్రజలు హెపటైటిస్ బి వైరస్ బారిన పడ్డారని ప్రభుత్వ గణాంకాలు చెపుతున్నాయి. ఈ వ్యాధి ప్రాణాంతకమైనదంటున్నారు వైద్యులు.
 
ఎలా వ్యాపిస్తుంది....
హెపటైటిస్ బి కలుషిత నీరు లేదా మలం ద్వారా వ్యాపించదు. కాని శారీరిక సంబంధాల ద్వారా, శరీరంలో ఊరే వివిధ స్రావాల ద్వారా... ఉదాహరణకు వీర్యం, యోని స్రావాలు, మూత్రం తదితరాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అలాగే ఒకరికి వాడిన సూది (ఇంజెక్షన్‌)నే మరొకరికి వాడితే, టాటూలు వేసుకోవడం, ముక్కు, చెవులు కుట్టుకోవడం, ఒకే రేజర్ బ్లేడ్‌ను చాలామంది వాడటం, ఇతరుల టూత్ బ్రష్ వాడటం, అసురక్షితమైన రక్తదానం చేయడం తదితరాల నుంచి ఈ వ్యాధి సంక్రమిస్తుందంటున్నారు వైద్యులు. 
 
ఈ వ్యాధిని ఎలా కనుగొనడం...
హెపటైటిస్ బి వ్యాధి బారిన పడ్డామా లేదా అనేదానికి హెచ్‌బీఎస్‌జీ పరీక్ష లేదా ఆస్ట్రేలియా యాంటిజన్ టెస్ట్ చేయించుకుంటే ఈ వ్యాధి ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుందంటున్నారు వైద్యులు. హెపటైటిస్ బి శరీరంలోని అతి పెద్దదైన గ్రంథి కాలేయంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కాలేయం మానవుని శరీరంలోని అతి పెద్ద గ్రంథి. ఇది ఉదరంలో క్రిందగా కుడివైపున మధ్యలో ఉంటుంది. కాలేయము పైత్యరసాన్ని తయారుచేస్తుంది. అది పిత్తాశయంలో నిలువచేయబడి జీర్ణక్రియలో చాలా తోడ్పడుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు. దీనిలోని కణాలను కాలేయకణాలంటారు.
 
ఈ కాలేయకణాలు హెపటైటిస్ బి వైరస్‌తో సంక్రమించబడతాయి. దీంతో కాలేయంలో తయారయ్యే పైత్యరసం నేరుగా రక్తంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలో దీనిశాతం పెరిగిపోవడంతో అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కోక తప్పదంటున్నారు వైద్యులు. కాలేయం వాచిపోతుంది. మూత్రం పసుపు పచ్చగా వస్తుంది. కళ్ళు, శరీర చర్మం, నాలుక తదితర భాగాలన్నీకూడా పసుపు వర్ణంలో మారిపోతాయి. దీనినే పచ్చ కామెర్లు అంటారు. 
 
ప్రారంభపు లక్షణాల్లో తొలుత తేలికపాటి జ్వరం, ఆకలి మందగించడం, వాంతులవ్వడం, అత్యధికమైన బలహీనత, కీళ్ళ నొప్పులుంటాయి. శరీరం మెలమెల్లగా పసుపు వర్ణంలోకి మారుతుంది. ఇది చాలా రోజులవరకు ఇలానే ఉంటుంది. కొందరి పరిస్థితి మరీ భయంకరంగా మారుతుంది. దీంతో కాలేయం సరిగా పని చేయదు. కాలేయం పనిచేయనప్పుడు మృత్యువుకు దారితీస్తుంది. ఈ వ్యాధినుంచి కోలుకున్నాకుడా చాలాకాలం వరకు వ్యాధికి సంబంధించిన దుష్పరిణామాలను రోగి ఎదుర్కోక తప్పదు.
 
వైద్యం: 
హెపటైటిస్ బి వ్యాధిని నిరోధించడానికి సరైన వైద్యం ఇంతవరకు అందుబాటులోకి రాలేదంటున్నారు ఆరోగ్యనిపుణులు. కేవలం ఉపశమనం కలిగేందుకు ఆహారం(పత్యం)లో మార్పులు, కాలేయానికి విశ్రాంతి, గ్లూకోజ్‌లాంటి ద్రవాలు సేవించడంతో శరీరానికి ఓ రకమైన శక్తిని ఇస్తాయి. శరీరానికి కావలసిన విటమిన్లు తదితరాలు కాస్త మెరుగైన జీవితాన్ని ప్రసాదిస్తాయంటున్నారు వైద్యులు.
About Author
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... Read More

అన్నీ చూడండి

ఏఐఎస్ఎ నాయకురాలు నేహా బోరా ముఖంపై సిరా, ఇది జంతర్ మంతర్ కాదంటూ...

వైకాపా మాజీ మంత్రి అప్పలరాజు బెయిల్ పిటిషన్‌ తిరస్కృతి

Hyderabad: వెళ్లేటప్పుడు ప్రియురాలితో వెళ్లాడు, వచ్చేటప్పుడు అంబులెన్సులో ఆమె శవాన్ని తెచ్చాడు

జనసేనతో పొత్తు వుండదు, ఒంటరిగానే పోటీ చేస్తాం: టిభాజపా చీఫ్ రాంచందర్ రావు

విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకున్న సంగీత విజయ్

అన్నీ చూడండి

Fauj Latest update :: స్వదేశం పక్షాన ఆంగ్లేయులతో పోరాటానికి దిగిన ఫౌజీ గా ప్రభాస్

రామాయణ గాథా చిత్రణ కారణంగా ఆదిపురుష్ పై మళ్లీ వ్యతిరేకత

Divi: స్టువర్టుపురం స్టూడెంట్స్ లో నేను భరతనాట్యం, బెల్లి డాన్స్ చేశా : దివి

Suriya: హృదయాలను హత్తుకునే విధంగా సూర్య చిత్రం విశ్వనాథ్ & సన్స్ ట్రైలర్

సింగిల్‌గా ఉండటమే చాలా సంతోషంగా ఉంది : అమీషా పటేల్

తర్వాతి కథనం