Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యరశ్మితో ఆస్తమా వ్యాధికి లింకుందా?

సూర్యరశ్మికి గురికావడం వల్ల విటమిన్ డి లభిస్తుంది. ఇది తీవ్రమైన ఆస్తమా లక్షణాలను నియంత్రిస్తుంది. విటమిన్ డి రోగనిరోధక శక్తిని చురుగ్గా చేయడానికి సహకరిస్తుంది. విటమిన్ డి లో విటమిన్ డి1, డి2, డి3 డి7

Written By Kowsalya
Updated: గురువారం, 24 మే 2018 (11:51 IST)
సూర్యరశ్మికి గురికావడం వల్ల విటమిన్ డి లభిస్తుంది. ఇది తీవ్రమైన ఆస్తమా లక్షణాలను నియంత్రిస్తుంది. విటమిన్ డి రోగనిరోధక శక్తిని చురుగ్గా చేయడానికి సహకరిస్తుంది. విటమిన్ డి లో విటమిన్ డి1, డి2, డి3 డి7 ఇలా చాలా రకాలున్నాయి. కానీ వాటిల్లో విటమిన్ డి2 (ఎర్గో క్యాల్సిఫెరాల్), విటమిన్ డి3 (కోలీ క్యాల్సిఫెరాల్) చాలా ముఖ్యమైనవి. 
 
ఆస్తమా లక్షణాలతో నిరంతరం బాధపడేవారికి ఓ మంచి శుభవార్త. ఆస్తమా రోగులకు సూర్యరశ్మి చక్కగా తోడ్పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. సాధారణంగా ఆస్తమా రోగుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, విటమిన్ డి లోపం కూడా ఉంటుందని, అలాంటి వారు తగినంత సూర్యరశ్మిని పొందడం వలన వారిలో రోగనిరోధక శక్తిని బలాన్ని పెంచుకోవచ్చును.
 
ముఖం, చేతులు, భుజాలు, సాధ్యమైనంత వరకు శరీర భాగాలు లేత ఎండ కాంతికి ఎక్స్‌పోజ్ అయ్యేలా సూర్యోదయ వేళల్లో ఆరుబయట నడవడం మంచి మార్గం. దీనితో పాటు డాక్టర్లు అనేక రకాల విటమిన్ డి మాత్రలను ఉపయోగించాల్సిన మోతాదులను సూచిస్తుంటారు. ఒకవేళ మాత్రలు సరిపడక స్వాభావిక రూపంలోనే విటమిన్-డి ని పొందాలని అనుకుంటే తీసుకోవాల్సిన ఆహారాం, చేపల కాలేయాల్లో లభ్యమయ్యే నూనెల్లో విటమిన్ డి దొరుకుతుంది.
 
విటమిన్-డి మాత్రలు వాడటం, కాడ్‌లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల రోజుకు 125 మైక్రో గ్రాముల మోతాదు దాటి ఒక్కోసారి విపరీతంగా దాహం, కంట్లో కురుపులు, చర్మంపై దురదలు రావడం వంటిని జరుగుతాయి. దాంతోపాటు వాంతులు, నీళ్లవిరేచనాలు వంటివి కూడా కనిపించవచ్చు. ఒక్కోసారి రక్తనాళాల్లోని,  మూత్రపిండాలలో క్యాల్షియమ్ పెచ్చులు రావచ్చును.
 
రక్తనాళాలతో పాటు కాలేయంలో, ఊపిరితిత్తుల్లో, మూత్రపిండాల్లో, కడుపులో క్యాల్షియమ్ మోతాదులు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎండలో తిరగడం లేదా స్వాభావికమైన ఆహారం ద్వారా కాకుండా ఇతరత్రా రూపాల్లో విటమిన్-డి తీసుకోవాల్సి వచ్చినప్పుడు కేవలం నిపుణుల సూచనల మేరకే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
About Author
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... Read More

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments