శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (11:21 IST)

సున్నాన్ని పులిపిరులపై రాస్తే....?

చాలామందికి చర్మంపై పులిపిరికాయలు ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగా చర్మంలో ఏదో పెద్ద సమస్య మొదలైందని బాధపడుతుంటారు. నిజానికి ఇది చాలా సాధారణ సమస్యననే ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పులిపిరులను ఉలిపిరి కాయలు, వార్ట్స్ అని కూడా పిలుస్తారు. ఈ పులిపిరులు పాపిలోనూ అనే వైరస్ కారణంగా వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే.. యుక్త వయస్సులో ఉన్న వారికే ఇవి ఎక్కువగా వస్తుంటాయి. మరి వీటిని తొలగించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం..
 
1. పులిపిరులున్న ప్రాంతాల్లో కొద్దిగా ఆముదం రాసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూటలా మూడు వారాల పాటు చేయడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది. పులిపిరులు తగ్గుతాయి. 
 
2. విటమిన్ ఎ, విటమిన్ సి ఉన్న పదార్థాలను చర్మానికి రాసుకుంటే కూడా పులిపిరికాయలు తగ్గుతాయి. ఉత్తరేణి మొక్క ఆకులను కాల్చి బూడిద చేసుకుని తులసి ఆకులతో కలిపి నూరి ఆవనూనె చేర్చి పులిపిరులపైన రాయాలి. ఇలా క్రమంగా చేస్తే పులిపిరులు పోతాయి. 
 
3. ఉల్లిపాయను సగానికి కట్ చేసుకోవాలి. ఒక సగభాగంలో మధ్యభాగాన్ని స్పూన్‌తో తొలగించి అందులో కొద్దిగా ఉప్పు వేసి నింపాలి. కాసేపటి వరకు అలానే ఉంచాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని పులిపిరులున్న ప్రాంతాల్లో రాసుకుంటే ఫలితం ఉంటుంది.
 
4. కొత్త సున్నాన్ని పులిపిరులపై రాస్తే అవి రాలిపోతాయి. అల్లం ముక్కను సున్నంలో ముంచి ఆపై దానిని పులిపిరులపై రాయాలి. ఇలా వారం పాటు క్రమం తప్పకుండా చేస్తే ఫలితం ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలను పులిపిరులపైన రుద్దుకోవాలి. ఇలా రోజూ చేస్తే అవి పోతాయి.