Daily Horoscope
✕

ఐరన్ ట్యాబ్లెట్లకు బదులు ఇవి తీసుకుంటే?

ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారా? అయితే ఇక వాటిని పక్కనబెట్టేయండి.. ఐరన్ సమృద్ధిగా వుండే ఆహారాన్ని తీసుకోండి.. అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. నీరసంగా వుండటం, కళ్లు తిరగడం, జుట్టు ఊడిపోవడం, చర్మం పాలిప

Written By Selvi
Updated: ఆదివారం, 22 జులై 2018 (11:20 IST)
ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారా? అయితే ఇక వాటిని పక్కనబెట్టేయండి.. ఐరన్ సమృద్ధిగా వుండే ఆహారాన్ని తీసుకోండి.. అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. నీరసంగా వుండటం, కళ్లు తిరగడం, జుట్టు ఊడిపోవడం, చర్మం పాలిపోవడం వంటివి.. ఐరన్ లోపానికి కారణం. అలాంటి రుగ్మతల నుంచి తప్పించుకోవాలంటే.. ఐరన్ పుష్కలంగా వున్న ఆహారాన్ని తీసుకోవాలి. 
 
సాధారణంగా శరీరభాగాల పనితీరుకి అత్యవసరమైన మూలకాల్లో ఐరన్‌ ఒకటి. రక్తంలోని ఆక్సిజన్‌ అన్ని భాగాలకూ చేరేందుకూ హార్మోన్ల తయారీకీ, శక్తి ఉత్పత్తికీ, కణాల పెరుగుదలకీ, రోగనిరోధ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికీ... ఇలా ఎన్నో పనులకి ఐరన్‌ అవసరం. అలాంటి ఐరన్ లోపం వల్ల ఆరోగ్యానికి కీడేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఐరన్‌ లోపిస్తే రక్తహీనత వస్తుంది. ఫలితంగా అన్ని భాగాల పనితీరుమీదా దాని ప్రభావం పడుతుంది. కాబట్టే ఐరన్‌ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మాంసం, చికెన్, చేపల్లో రెండు రకాల ఐరన్ వుంటుంది.
 
అదే కూరగాయల్లోనూ ఐరన్ శాతం ఎక్కువ. కాబట్టి మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లోనే ఐరన్‌ లోపం ఎక్కువ. ఐరన్ లోపం వున్నవారు నట్స్‌, విత్తనాలతోబాటు పాలకూర, బ్రకోలి, కొత్తిమీర... వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా తీసుకున్న ఐరన్‌ ఒంటికి పట్టాలంటే విటమిన్‌-సి ఎక్కువగా ఉండే పండ్లను, పప్పు దినుసులు, పొట్టు ధాన్యాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బత్తులపల్లి సీఐ సవాల్.. దమ్ముంటే నిరూపించు (వీడియో)

cyclone alert, కాకినాడ తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్

పట్టపగలే దారుణ హత్య : నడిరోడ్డుపై కారుతో ఢీకొట్టి - రాడ్డుతో కొట్టి చంపేశారు...

మహిళా పోలీస్‌తో తోపులాట : కిందపడిన మాజీ మంత్రి విడదల రజని (వీడియో)

నల్లచెరువు జడ్పీటీసీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్

అన్నీ చూడండి

Rukmini Vasanth: డైరెక్టర్ శ్రీ కార్తిక్ చిత్రంలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్‌

ఎన్వీఆర్ సినిమా ద్వారా సూర్య, నజ్రియా నజీమ్‌ చిత్రం సీన్ రిలీజ్

విజయ్ శంకర్, సిరి చౌదరి, ఖయ్యూమ్ కాంబినేషన్ లో మిస్టర్ దెయ్యం

ఇడుపు కాయితం మన ఇంటి కథ అందరినీ ఆకట్టుకుంది - బన్నీ వాస్

Kalki 2: భైరవగా సెట్స్‌లో అడుగుపెట్టిన ప్రభాస్ - కల్కి సీక్వెల్ టీమ్ బర్త్‌డే విషెస్

తర్వాతి కథనం
Show comments