Daily Horoscope
✕

లావుగా వున్నవారికి బుర్ర సరిగా పనిచేయదా? ఊబకాయానికి మానసిక ఆరోగ్యానికి లింక్ వుందా?

Written By సిహెచ్
Updated: శనివారం, 13 మార్చి 2021 (21:38 IST)
ఊబకాయం. ఈ రోజుల్లో ఇది చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇదొకటి. అధిక బరువు, ఊబకాయం ఉన్నవారు ఆందోళన, నిరుత్సాహం, ఒత్తిడికి లోనవుతుంటారని, వారి జీవితంలోని లోపాలను వెతుక్కుంటూ, ఇతరులను నిందించే పనిలో వుంటారని ఓ అధ్యయనంలో తేలింది. ఐతే బరువు పెరగడం అనేది వ్యక్తిగత భావోద్వేగ సమస్యకు దారి తీస్తుందనే వాదనను పలువురు తోసిపుచ్చారు.
 
చాలా అధ్యయనాలు మానసిక ఆరోగ్యం మరియు బరువు సమస్య మధ్య స్పష్టమైన అనుబంధాన్ని కనుగొనలేదు. కానీ ఈ బరువు నడుము చుట్టూ కేంద్రీకృతమై ఉన్నవారిలో సమస్య కనబడుతుంటుందని చెపుతున్నారు. సాధారణంగా కొవ్వు, చక్కెర, కేలరీలు ఎక్కువగా తీసుకోవడంతో రోజురోజుకీ అధిక బరువుతో సతమతమవుతుంటారు. ఫలితంగా వారిలో ఆందోళన, ఒంటరితనం, కోపంగా లేదా తక్కువ ఆత్మగౌరవంతో బాధపడుతుంటారని తేలింది.
 
అంతేకాదు పనిపట్ల శ్రద్ధ లేకపోవడం, బద్ధకంతో పాటు అతిగా తినడం వంటి లక్షణాలతో కూడిన మాంద్యం ఉంటుంది. ఊబకాయం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇది నిరాశ, ఆందోళనతో ముడిపడి ఉంటుంది. అధిక బరువు కారణంగా శరీర ఆకృతిలో తేడాలు వస్తాయి కనుక ఆకర్షణీయతను కోల్పోతారు. ఫలితంగా సామాజిక వివక్షకు గురవుతూ, భావోద్వేగ ఒత్తిడి పెరిగి మరింత బరువు పెరగడానికి దారి తీయవచ్చు.
 
ఒకవైపు బరువు పెరుగుతున్నా ఏమాత్రం బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నించకపోతే సమస్య మరింత ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఇతరులు తమను చూసి ఏమనుకుంటున్నారోనన్న మానసిక వ్యధతో వుంటుంటారు. కనుక అధిక బరువు అనర్థదాయకం. నిత్యం వ్యాయామం చేస్తూ శరీర బరువును నియంత్రణలో వుంచుకున్నవారికి ఆరోగ్యోంతో పాటు చక్కటి ఆలోచనలతో వుంటారు.

అన్నీ చూడండి

స్పెయిన్ రైలు ప్రమాదం.. 68కి పెరిగిన మృతుల సంఖ్య... వందమందికి గాయాలు

మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ కోటలో కాంగ్రెస్ జెండా రెపరెపలు

అర్నబ్ ఎఫెక్ట్- నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

ఏపీ స్థానిక సమరం : టీడీపూ కూటమి ప్రభంజనం ... పులివెందులలో క్లీన్‌స్విప్

Cyclone Arnab: అర్నాబ్‌ తుఫాను.. ఎనిమిది మంది మృతి (video)

అన్నీ చూడండి

Sri Vishnu: సమ్మర్ హాలిడేస్..ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది : హీరో శ్రీవిష్ణు

Harish Shankar: రుద్రవనం పీఎస్.. కంటెంట్ చూశా, హిట్ అవుతుందనే నమ్మకం వుంది : హరీష్ శంకర్

Anil Ravipudi :డెస్టినీ లో ఇద్దరి గుండెలపైన సాంగ్ బాగుంది : అనిల్ రావిపూడి

Purvaj: కిల్లర్.. ట్విస్ట్ చెబితే కోటి రూపాయల బహుమతి : పూర్వాజ్

రావణాసురుడు మరీ అంత చెడ్డవాడేం కాదు : సాయి పల్లవి

తర్వాతి కథనం
Show comments