చలికాలంలో చిరుధాన్యాలు.. ఇలా తీసుకుంటే ఒబిసిటీ పరార్
చిరుధాన్యాలు చలికాలంలో ఆరోగ్యంగా ఎంతో మేలు చేస్తాయి. తేలికగా జీర్ణమవుతాయి. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, కొవ్వు తగ్గుతుంది. ఇప్పటికే అసిడిటీ ఉన్నవారు వీటిని తినటం వలన చాలా మేలు చేస్తాయి. ఊబకాయం, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా వీటిని రోజు తీసుకోవచ్చు. తక్కువ తినగానే పొట్ట నిండుగా అనిపించటం వలన ఊబకాయం కూడా తగ్గుతుంది.
వీటిలోని పీచు పదార్ధం వలన ఉదర సమస్యలు తగ్గుతాయి. బాగా నమిలి తినటం వలన ఆహారం జీర్ణం అవుతుంది. రక్తహీనత కూడా తగ్గుతుంది. రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. దీని వలన హార్మోన్ల అసమానం తగ్గి సమస్యలు దరిచేరవు. హార్మోన్లు సరిగా ఉంటే సంతానలేమి సమస్య కూడా తగ్గుతుంది. శరీరంలో వ్యర్థాలను ఇవి తొలగించేందుకు ఉపయోగపడతాయి.
శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి. కాలేయం, పిత్తాశయం పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. చిరు ధాన్యాలను ఉడికించి తీసుకోవడం లేకుంటే మొలకెత్తించాక తీసుకోవచ్చు. ఇంకా వంటల రూపంగానూ తీసుకోవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లైనా తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.