Festival Posters
✕

పైనాపిల్ చిన్న ముక్క ఒకటి తింటే చాలు

Written By సిహెచ్
Updated: బుధవారం, 13 సెప్టెంబరు 2023 (21:29 IST)
అనాస పండు లేదా పైనాపిల్. ఈ పండు తింటుంటే ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి మొదలైనవి తగ్గుతాయి. శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు నేత్ర దృష్టిని మెరుగుపరుస్తుంది. పిల్లల చేత తరచుగా ఈ పండు రసం తాగిస్తే ఆకలి పెరుగుతుంది. ఈ పండుతో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. పైనాపిల్ ముక్కలను తేనెలో కలిపి తింటుంటే శారీరక శక్తి పెరిగి నిగారింపు వస్తుంది.
 
పైనాపిల్‌ను తరచుగా తింటుండటం వల్ల మూత్ర పిండాలలోని రాళ్ళు కరిగిపోతాయి. గుండె దడ, బలహీనత తగ్గేందుకు అనాసపండు తింటుంటే ప్రయోజనం వుంటుంది. పైనాపిల్ రసాన్ని రోజుకి 4 సార్లు ఒక ఔన్సు మోతాదుగా తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. పైనాపిల్ రసాన్ని గొంతులో పోసుకుని కాసేపు అలాగే ఉంచుకుని మింగుతుంటే గొంతు నొప్పి, గొంతు పుండు తగ్గిపోతాయి.
 
కడుపు నిండుగా ఆహారం తీసుకున్న తర్వాత ఒక చిన్న అనాస ముక్కను తింటే చాలు జీర్ణమైపోతుంది. అనాస పండు పచ్చకామెర్లను నయం చేసే గుణాన్ని కలిగి ఉంది. అనాసపండు గర్భ సంచిని ముడుచుకు పోయేలా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది కనుక గర్భిణిలు ఈ పండుకు దూరంగా ఉండాలి.

అన్నీ చూడండి

మహిళలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ఆర్టీసీ

హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులకు శుభవార్త - ఐటీ కారిడార్‌లో వన్ వే లూప్

Weather Forecast: నవంబర్ 14.. తెలంగాణ, ఏపీ వాతావరణం ఎలా వుందంటే..?

రీల్స్ కోసం సింహంతో ఆటలు... దాడిలో 19 యేళ్ల కేర్‌టేకర్ మృతి

విజయవాడ కృష్ణలంకలో దారుణం: యువకుడితో కలిసి లాడ్జికి వచ్చిన వివాహిత దారుణ హత్య

అన్నీ చూడండి

Dada song: నర్గీస్ ఫక్రీ, బాలకృష్ణ లపై దాదా ధమాకా:ఫస్ట్ సింగిల్‌

Nithin: నితిన్ చిత్రం అలియాస్ రుక్మిణి నుంచి పిచ్చి ప్రేమలో పాట రిలీజ్

Dil Raju Launch: జయంత్ అండ్ ది జింగో పెన్ నుంచి నా కనుపాపే.. సాంగ్

G.V. Prakash Kumar :ఆకాశంలో ఒక తార చిత్రానికి నేషనల్ అవార్డ్స్ వస్తుందని నమ్ముతున్నా : జీవీ ప్రకాశ్ కుమార్

సీఐఐ భాగస్వామ్య సదస్సులో 36.24 కోట్ల ఎంవోయూ కుదుర్చుకున్న నమస్తే వరల్డ్

తర్వాతి కథనం
Show comments