పక్షవాతానికి మందు పాలకూర!

పక్షవాతమును నివారించే విషయంలో పాలకూర సమర్థంగా ఉపయోగపడుతుందని చైనీస్ శాస్త్రవేత్తలు అధ్య‌య‌నంలో నిరూపించారు. పాలకూరలోని ఫోలిక్ యాసిడ్ వల్ల ఈ ప్రయోజనం జ‌రుగుతుందని శాస్త్రవేత‌లు తెలిపారు. ముఖ్యంగా హైపర్‌టెన్షన్ (హైబీపీ) వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలను ఫో

బుధవారం, 8 జూన్ 2016 (16:17 IST)
పక్షవాతమును నివారించే విషయంలో పాలకూర సమర్థంగా ఉపయోగపడుతుందని చైనీస్ శాస్త్రవేత్తలు అధ్య‌య‌నంలో నిరూపించారు. పాలకూరలోని ఫోలిక్ యాసిడ్ వల్ల ఈ ప్రయోజనం జ‌రుగుతుందని శాస్త్రవేత‌లు తెలిపారు. ముఖ్యంగా హైపర్‌టెన్షన్ (హైబీపీ) వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలను ఫోలిక్ యాసిడ్ బాగా నివారిస్తుందని, పాలకూరలో ఇది పుష్కలంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. హైబీపీ ఉన్న 20,702 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలిందని శాస్త్రవేత‌లు తెలిపారు.
 
వీరంతా హైబీపీని తగ్గించే ‘ఎనాలప్రిల్’ అనే మందును వాడుతున్నారు.వీరికి ఈ మందుతో పాటు ఫోలిక్ యాసిడ్ ఎక్క‌వ మోతాదులో ఉండే పాలకూరలు, ఇతర ఆకుకూరల కాంబినేషన్లలలో ఆహారాన్నిఇవ్వ‌డం జ‌రిగింది. అయితే ఫోలిక్ యాసిడ్‌ను క్రమంతప్పకుండా తమ ఆహారంలో తీసుకుంటున్నవారిలో స్ట్రోక్ వచ్చేందుకు ప్ర‌మాదం ఉన్నవారే అయినప్పటికీ అవి వచ్చే అవకాశాలు 21 శాతం పడిపోయాయని అధ్యయనవేత్తలు గమ‌నించారు. దీనితో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గాయని శాస్త్రవేత‌లు తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలను ‘ద జర్నల్ ఆఫ్ ద అమెరికన్ అసోసియేషన్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురిత‌మ‌య్యింది.

అన్నీ చూడండి

ధర్ భోజ్‌శాల హిందువులదే - సరస్వతి పూజకు అనుమతి : మధ్యప్రదేశ్ హైకోర్టు

రాయలసీమను రతనాలసీమగా చేస్తాం : సీఎం చంద్రబాబు నాయుడు

డ్రోన్ హబ్‌గా కర్నూలు... యుద్ధ రంగంలో డ్రోన్ టెక్నాలజీ ఒక గేమ్ ఛేంజర్ : రాజ్‌నాథ్ సింగ్

విజయవాడ వాసులకు బుడమేరుతో వెన్నులో వణుకు, పనులు నత్త నడకన...

ఉన్నావ్ అత్యాచారం కేసు : ముద్దాయి కుల్దీప్ సింగ్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments