Daily Horoscope
✕

నొప్పే కదా అని మసాజ్ చేసుకుంటే.. ప్రాణమే పోతుంది జాగ్రత్త...

కాలికి ఏదైనా గాయమై, రక్తం గడ్డకట్టినప్పుడు అక్కడ ఏదైనా తైలం లేదా యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ క్రీములను పూయమని, కానీ ఆ ప్రాంతంలో గట్టిగా ఒత్తిడి కలిగించకూడదని వైద్యులు చెప్తూనే ఉంటారు. మరి ఢిల్లీలోని ఓ తల్లికి ఈ విషయం తెలియక చేతికి అందివచ్చిన కొడుకుని పోగొట్టు

Written By venu
Updated: మంగళవారం, 2 మే 2017 (11:58 IST)
కాలికి ఏదైనా గాయమై, రక్తం గడ్డకట్టినప్పుడు అక్కడ ఏదైనా తైలం లేదా యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ క్రీములను పూయమని, కానీ ఆ ప్రాంతంలో గట్టిగా ఒత్తిడి కలిగించకూడదని వైద్యులు చెప్తూనే ఉంటారు. మరి ఢిల్లీలోని ఓ తల్లికి ఈ విషయం తెలియక చేతికి అందివచ్చిన కొడుకుని పోగొట్టుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే... ఓ 23 ఏళ్ల యువకుడికి బ్యాడ్మింటన్ ఆడే సమయంలో కాలి మడమకు గాయమైన ఫలితంగా కాలి నరాల్లో రక్తం గడ్డకట్టింది. కాలికి వేసిన ప్లాస్టర్ తీసివేసినప్పటికీ, అతని కాలి నొప్పి, వాపు తగ్గలేదు. కొడుకి బాధ చూడలేని తల్లి కాలిని మసాజ్ చేసింది. మసాజ్ చేసే సమయంలో ఆమె ఉపయోగించిన శక్తికి కాలిలో గడ్డకట్టిన రక్తం అక్కడి నుండి కదిలి, అతని ఊపిరితిత్తుల్లోకు రక్తాన్ని సరఫరా చేసే పుఫుస ధమనుల్లోకి ప్రయాణించి వెంటనే అతని గుండె ఆగిపోయేలా చేసింది.
 
సాధారణంగా గడ్డకట్టిన రక్తం క్రమంతప్పకుండా నిపుణులు ఇచ్చే ఔషధాలతో వాటంతటవే కరుగుతాయని, అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టినప్పుడు చాలా అరుదుగా ఇలాంటివి సంభవిస్తాయని, ప్లాస్టర్ తీసివేసిన తర్వాత కూడా నొప్పి లేదా వాపు తగ్గకుంటే ఎముకల వైద్య నిపుణుడిని సంప్రదించాలి కానీ స్వంత వైద్యం కూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అన్నీ చూడండి

మునిసిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడాము, ఏపీలో ఏ ఎన్నిక జరిగినా ఇదే రిపీట్: అంబటి రాంబాబు

రెస్క్యూ బోట్లు బోల్తా.. గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సేఫ్..

అమరావతిపై వైసిపి నాయకుడు కేతిరెడ్డి అసత్య ప్రచారం, ఇది ఫ్యాక్ట్ చెక్ అంటూ...

ఏపీ ఎన్నికలు - 100 శాతం స్ట్రైక్ రేటుతో రికార్డు సృష్టించిన జనసేన

మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించిన హైదరాబాదీ

అన్నీ చూడండి

Supriya: #బాలుగీత అందరికీ రిలేట్ అయ్యే సినిమా : సుప్రియ యార్లగడ్డ

Niharika Konidela: పాకెట్ రాకెట్స్ తో మేమంతా మీ సోషల్ మీడియా, మీ ఇంట్లోకి వచ్చేస్తాం - నిహారిక కొణిదెల‌

V.V. Vinayak: వీవీ వినాయక్ ప్రారంభించిన కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం

Naga Chaitanya: వృషకర్మ కోసం నాగ చైతన్య 'స్వాగ్ ఆఫ్ అర్జున్' సింగిల్‌ను ఆవిష్కరించారు

NTR Trailer: ఎన్టీఆర్ లాంచ్ చేసిన ఇట్లు అర్జున ట్రైలర్‌

తర్వాతి కథనం
Show comments