1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2016 (10:01 IST)

చింతచిగురు రోగ నిరోధక శక్తిని పెంచుతుందట!

ఎండాకాలమైనా.. రాలిన చెట్లు మళ్లీ చిగురిస్తున్నాయి. అందులో చింతచిగురు ఒకటి. చింతచిగురుతో వండిన వంటలు ఎంతో రుచిగా.. పుల్లపుల్లగా నోరూరిస్తాయి. చింతచిగురుతో పప్పు వండుతారు. పచ్చడి చేస్తారు. చింతచిగురు ఆరోగ్యానికి కూడా మంచిది. చింతచిగురు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే ఫోలిక్ ఆసిడ్, బీటా కెరోటిన్ ఆరోగ్యానికి మంచివని నిపుణులు అంటున్నారు.
 
ఇక ఫిలిప్పైన్స్‌లాంటి దేశాల్లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వాడతారట. పుల్లపుల్లగా ఉండే చింత చిగురు ఇచ్చే ప్రయోజనాలు తక్కువేం కాదు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహద పడుతుంది. ఇందులోని ఫోలిక్ యాసిడ్, బీటా-కెరోటిన్‌ అనారోగ్య సమస్యలను దూరం చేసేందుకు ఉపయోగపడుతుంది.