Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాదుంపల్ని తింటే లావెక్కుతారా? (Video)

బంగాళా దుంపల్ని తింటే లావెక్కుతారని కొందరి అపోహ. ఇందులో కొంత నిజమున్నా.. మధుమేహం, ఊబకాయంతో ఇబ్బంది పడుతున్న వారు స్వల్పంగానే వీటిని తీసుకోవాల్సి వుంటుంది. కానీ ఎదిగే పిల్లలు మూడు పదులు నాలుగు పదులు దా

Written By selvi
Updated: మంగళవారం, 5 డిశెంబరు 2017 (13:55 IST)
బంగాళా దుంపల్ని తింటే లావెక్కుతారని కొందరి అపోహ. ఇందులో కొంత నిజమున్నా.. మధుమేహం, ఊబకాయంతో ఇబ్బంది పడుతున్న వారు స్వల్పంగానే వీటిని తీసుకోవాల్సి వుంటుంది. కానీ ఎదిగే పిల్లలు మూడు పదులు నాలుగు పదులు దాటిన వారు ఆహారంలో బంగాళాదుంపను తప్పక చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

బంగాళాదుంపల్లో కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా వుంటాయి. బంగాళా దుంపలు ఎక్కువ క్యాలరీలను ఒక్కసారిగా అందిస్తాయి కాబట్టి.. మోతాదుకు మించకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. బంగళాదుంపల్లో పీచు పుష్కలంగా వుంటుంది. 
 
అందుకే వీటిలో పైనున్న తొక్క తీయకుండా వండాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పొట్టులోని పీచు పొట్టను శుభ్రం చేస్తుంది. అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. బంగాళాదుంప రక్తపోటును తగ్గిస్తుంది. ఆలూలో విటమిన్‌–సి, బి–కాంప్లెక్స్‌తో పాటు పొటాషియమ్, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్, జింక్‌ ఉంటాయి. ఇవన్నీ చర్మకాంతికి తోడ్పడుతాయి. యాంటీ-ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. 
 
పొటాటోలోని బీ6 నరాల వ్యవస్థకు మేలు చేస్తుంది. విటమిన్ బి6 ఒత్తిడిని దూరం చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయులను సక్రమంగా వుంచుతుంది. తద్వారా నరాలకు, మెదడుకు రక్తప్రసరణ క్రమంగా వుంటుంది. ఇందులోని విటమిన్ సి ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఫైబర్ ద్వారా హృద్రోగ సమస్యలు నయం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 

అన్నీ చూడండి

ఇరాన్‌కు సాయం చేసేవారి అంతు చూస్తాం : డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

అహోబిలం సమీపంలో దారి తప్పిన ఆరుగురు భక్తులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి.. జగన్ పిలుపు

ఒంగోలులో ఘోరం - లిఫ్ట్ కింద చిక్కుకుని మహిళ మృతి (video)

న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి సరిత కోమటిరెడ్డి పోటీ - ట్రంప్ మద్దతు

అన్నీ చూడండి

Yash: ఓవర్ సీస్ లో భారీగా యశ్... టాక్సిక్ అమ్మకాలు - ఇంగ్లీష్ ట్రైలర్ విడుదల

షావుకారు జానకి తీవ్ర అస్వస్థత - వెంటిలేటర్‌పై చికిత్స!

Yami Gautam: చలాకి కోడలు గా యామీ గౌతమ్ చిత్రం నయ్యి నవెల్లి

Anil Ravipudi: వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రం పేరు జనవరి 12 విడుదల

Shravan Reddy: అగధ లో హీరోగా, యాంటీ హీరోగా సర్‌ప్రైజ్ చేస్తున్న శ్రవణ్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments