మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2017 (16:19 IST)

వర్షాకాలంలో పరోటాలు తినొద్దు.. మటన్, చికెన్ ఉడికించాకే?

వర్షాకాలంలో చికెన్, మటన్ బాగా ఉడికించిన తర్వాతే తినాలి. తినే ఆహార పదార్థాలు వేడి వేడిగా ఉండేట్లు చూసుకోవాలి. బయటి చిరు తిండ్లకు, ఫాస్ట్ ఫుడ్‌లకు దూరంగా ఉండండి. హెర్బల్ టీ, సూపులు వంటి వేడి వేడి పానీయా

వర్షాకాలంలో చికెన్, మటన్ బాగా ఉడికించిన తర్వాతే తినాలి. తినే ఆహార పదార్థాలు వేడి వేడిగా ఉండేట్లు చూసుకోవాలి. బయటి చిరు తిండ్లకు, ఫాస్ట్ ఫుడ్‌లకు దూరంగా ఉండండి. హెర్బల్ టీ, సూపులు వంటి వేడి వేడి పానీయాలను తాగండి. దోమలు పెరిగే వాతావరణాన్ని పూర్తిగా నిర్మూలించండి. కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోకపోవడం మంచిది.
 
వంటలను అప్పటికప్పుడు తయారు చేసుకుని తీసుకోవడం మంచిది. తినే ఆహార పదార్థాలను వేడి వేడిగా ఉండేటట్లు చూసుకోండి. దోమలు, ఈగలు, బొద్దింకలు ఇంట్లో లేకుండా చూసుకోండి. బయట అమ్మే చోలా పూరీ, పరోటాలు తినకండి. వర్షాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారానికి అలవాటు పడండి. శరీరాన్ని శుభ్రంగా వుంచుకోవాలి. వేడి నీటి స్నానం చేయాలి. 
 
చర్మాన్ని పొడిగా వుంచుకోవాలి. వేడినీటినే తాగండి. దాహం వేయకపోయినా నీరు తాగుతూ వుండాలి. లేకుండా శరీరం డీ-హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.