Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ వైన్ తాగితే.. ఆరోగ్యానికి మేలే.. తెలుసా?

Written By సందీప్
Updated: శుక్రవారం, 3 జనవరి 2020 (12:37 IST)
మద్యం త్రాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని చాలా మంది భావిస్తారు. కానీ తగిన మోతాదులో త్రాగితే ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. రోజూ ఒక గ్లాసు త్రాగితే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అందం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రెడ్ వైన్ త్రాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఎలాజిక్ ఆమ్లం కొవ్వు కణాల వృద్ధి రేటును తగ్గిస్తుంది, తద్వారా బరువు తగ్గవచ్చు. 
 
టైప్ 2 డయాబెటిస్‌ను కూడా ఇది నివారిస్తుంది. అయితే దీనిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రెడ్ ‌వైన్‌లో ఉండే టానిన్‌లు శరీరంలోకి ప్రవేశిస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది. కాబట్టి ఎవరైనా రెడ్ వైన్‌ను తాగొచ్చు. దీన్ని త్రాగడం వల్ల రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. రెడ్‌వైన్‌ను త్రాగడం వల్ల శరీరం కాంతివంతంగా మారుతుంది. 
 
ముఖ కండరాలు వదులవుతాయి. మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పడుకునే ముందు ఒక గ్లాసు రెడ్ వైన్ త్రాగితే నిద్ర బాగా పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఇన్ని విధాలుగా ప్రయోజనాలు ఉన్నాయని రెడ్ వైన్ ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ ఫలితాలు పొందవచ్చని భావించకూడదు. పరిమితంగా తీసుకోవాలి.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments