కూరగాయలు దీర్ఘకాలం.. తాజాదనం కోల్పోకుండా ఉండాలంటే...
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజూ తాజా కూరగాయలని మార్కెట్ కెళ్లి తెచ్చుకోవడానికి వీలుపడదు. అందుకోసం చాలామంది వారానికి సరిపడా కూరగాయలు ఒకే సారి తీసుకొచ్చి ఫ్రిజ్‌లో పెట్టి వాడుతుంటారు. ఫ్రిజ్‌లో పెట్ట
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజూ తాజా కూరగాయలని మార్కెట్ కెళ్లి తెచ్చుకోవడానికి వీలుపడదు. అందుకోసం చాలామంది వారానికి సరిపడా కూరగాయలు ఒకే సారి తీసుకొచ్చి ఫ్రిజ్‌లో పెట్టి వాడుతుంటారు. ఫ్రిజ్‌లో పెట్టినంత మాత్రానా కూరగాయలు ఎక్కువ సమయం పాటూ తాజాగా ఉంటుందను కుంటే పొరపాటు. కానీ కొన్ని సులభ చిట్కాలను పాటించటం ద్వారా కూరగాయలు, పండ్లను ఎక్కువ కాలం పాటూ తాజాగా ఉంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
పచ్చిని ఆకుకురాలను ఫ్రిజ్‌లో ఎక్కువ సమయం పాటూ చల్లటి ఉష్ణోగ్రతల ఉంచటం వలన అవి వాటి తాజాదనాన్ని కోల్పోతుంది. కానీ, ఐస్ నీటిలో కడగటం ద్వారా వాటి తాజాదనాన్ని తిరిగి సంతరించుకుంటుంది. టమోటాలు, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి లాంటి వాటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఇవన్నీ బయటపెడితేనే చాలా రోజులు తాజాగా ఉంటాయి.
కూరగాయలను ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టి ఆ బ్యాగులకు చిన్న చిన్న రంధ్రాలు పెట్టాలి. దీనివల్ల గాలి లోపలికి వెళ్లి కూరలు పాడవకుండా తాజాగా ఉంటాయి.ఆకుకూరల పైభాగానికి పేపర్ చుట్టి పెట్టడం వల్ల మరింత తాజాగా ఉంటాయి.
నెట్ ప్లాస్టిక్ బ్యాగ్‌లలో కూరగాయలను పెట్టడం వల్ల లోపలికి గాలి వెళ్లి కూరగాయలు తాజాగా ఉంటాయి.కొత్తిమీర కరివేపాకు పుదీనాలాంటి వాటిని రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచేటపుడు వాటి వేర్లను కత్తిరించి బ్యాగుల్లోపెట్టాలి. కేరట్, ముల్లంగిలాంటి కూరలను భద్రపరచాలంటే ముందుగా వాటి ముచ్చికలు కట్ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.