ఎపుడు కోలుకుంటానో భగవంతుడికే తెలియాలి : రష్మిక మందన్నా
తాను ఎంతో పవిత్రంగా భావించే జిమ్‌లో గాయపడ్డానని, తాను ఎపుడు కోలుకుంటానే ఆ భగవంతుడుకే తెలియాలి హీరోయిన్ రష్మిక మందన్నా అన్నారు. తాజాగా ఆమె జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ రష్మిక గాయపడిన విషయం తెల్సిందే. తన కాలికి కట్టు కట్టుకుని ఉన్న ఫొటోని తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా వేదికగా షేర్ చేశారు. గాయం మానడానికి ఎంత సమయం పడుతుందో తెలియదన్నారు.
"నూతన సంవత్సర శుభాకాంక్షలు! నేను ఎంతో పవిత్రంగా భావించే జిమ్‌లో గాయపడ్డాను. పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలి. త్వరగా కోలుకుని 'సికందర్', 'థామ', కుబేర' సెట్స్‌లలో పాల్గొనాలని ఆశిస్తున్నా. ఈ ఆలస్యానికి క్షమించాలని ఆయా చిత్రాల దర్శకులను కోరుతున్నా. నా కాలు ఏమాత్రం సెట్ అయినా వెంటనే షూటింగులో భాగం అవుతా' అని ఆమె రాసుకొచ్చారు.
'పుష్ప 2'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 'సికందర్'లో నటిస్తున్నారు. గాయంతో షూటింగుకు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ యాక్షన్ మూవీ. మరో బాలీవుడ్ చిత్రం 'థామా'లోనూ ఆమె నటిస్తున్నారు.