శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2017 (17:47 IST)

స్మార్ట్‌ఫోన్లు మైకంలో యువత: డేటింగ్ లేదూ.. ఫ్రెండ్సూ లేరు.. గదిలోనే కూర్చుని ఒంటరివారైపోతున్నారు..

టెక్నాలజీ పెరిగే కొద్దీ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్ల పుణ్యంతో నేటి యువతరం క్రీడలు ఆడుకునేందుకు, వ్యాయామం చేసేందుకు ఆసక్తి చూపట్లేదు. స్మార్ట్ ఫోన్ లోకంలో.. ఆ మాయలో తిరగాడుతోంది. అయితే స్మార్ట

టెక్నాలజీ పెరిగే కొద్దీ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్ల పుణ్యంతో నేటి యువతరం క్రీడలు ఆడుకునేందుకు, వ్యాయామం చేసేందుకు ఆసక్తి చూపట్లేదు. స్మార్ట్ ఫోన్ లోకంలో.. ఆ మాయలో తిరగాడుతోంది. అయితే స్మార్ట్ ఫోన్ వ్యసనం భవిష్యత్ తరాలకు పెనుముప్పు మారనుందని ట్వెంజ్‌ అనే అమెరికా పరిశోధకురాలు తెలిపారు.

స్మార్ట్ ఫోన్ వినియోగం ద్వారా సమాజంలో ఏర్పడుతున్న మార్పుల అంశంపై జరిపిన పరిశోధనలో.. గత 25 ఏళ్ల పాటు జరుగుతున్న పరిణామాలపై జరిగిన అంశాలను పరిశీలించారు. ప్రస్తుత యువతరానికి స్మార్ట్ ఫోన్ వ్యసనంగా మారిపోయిందని ట్వెంజ్ వెల్లడించారు. 
 
ఈ స్మార్ట్ ఫోన్ వ్యసనం నేటితరం యువతిని పనికిరానివారిగా మార్చేస్తుందని.. వారి విలువైన సమయాన్ని తినేస్తోందని చెప్పారు. నేటి యువతరం గత తరాల ప్రజల్లా సంతృప్తికరమైన జీవన విధానాన్ని ఆస్వాదించట్లేదని క్వెంజ్ వెల్లడించారు.
 
2000-2015 మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ కారణంగా స్నేహితులతో గడిపే వారి సంఖ్య 40 శాతానికి పడిపోయిందని, ఒంటరితనం పెరిగిపోయిందని అన్నారు.  భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్లతో పెను ముప్పు తప్పదని హెచ్చరించారు.

స్మార్ట్ ఫోన్ల కారణంగా సెక్యువల్ యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయని తద్వారా ఒత్తిడి పెరిగిపోతుందని క్వెంజ్ చెప్పారు. దీంతో సంతోషంగా వుండాల్సిన యువత ఏదో కోల్పోయినట్టుగా వుందనే విషయం పరిశోధనలో క్వెంజ్ చెప్పుకొచ్చారు. స్మార్ట్ ఫోన్ల కారణంగా డేటింగూ లేదు... ఒళ్లొంచి శ్రమపడట్లేదని తద్వారా మానసిక ఆందోళలనకు గురవుతున్నారని క్వెంజ్ తెలిపారు.