శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 19 మార్చి 2017 (16:51 IST)

అరలీటర్‌ నీటిలో 50 గ్రాముల బెల్లం కలిపి?

వేసవిలో దానిమ్మ పండ్ల రసంలో పంచదార కలిపి లేత పాకంగా చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల మోతాదులో రోజూ మూడుసార్లు తాగితే దాహం తీరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే పలుచని మజ్జిగలో కరివేపాకు, నిమ్మరసం,

వేసవిలో దానిమ్మ పండ్ల రసంలో పంచదార కలిపి లేత పాకంగా చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల మోతాదులో రోజూ మూడుసార్లు తాగితే దాహం తీరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అలాగే పలుచని మజ్జిగలో కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు కలిపి తాగితే వేసవి దాహం తీరుతుంది. ఒక గ్లాసు చల్లని నీటిలో ఒక స్పూన్‌ నిమ్మరసం, నాలుగు చెంచాల పంచదార కలిపి తాగితే దాహం తగ్గుతుంది. 
 
పెరుగు అన్నంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు కలిపి తింటే త్వరగా దాహం తీరడంతో పాటు వడదెబ్బ నుంచి కోలుకుంటారు. అరలీటర్‌ నీటిలో 50 గ్రాముల బెల్లం కలిపి లేత పాకం చేసుకోవాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే దాహం వెంటనే తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.