Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో తెలుసా?

Written By మోహన్
Updated: బుధవారం, 22 మే 2019 (17:56 IST)
సాధారణంగా మనం కాలానుగుణంగా తీసుకునే ఆహారం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రత్యేకంగా ఈ వేసవి సీజన్‌లో మాత్రం తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఎరుపు, ఆరెంజ్, పసుపు రంగులలో లభించే గుమ్మడి, బంగాళదుంప, చిలగడదుంప, బీట్‌రూట్, క్యారెట్ వంటి కూరగాయలను తింటే మంచిది. వీటిల్లో విటమిన్-ఎ, విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. 
 
ఎండలో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసు నీరు తీసుకుంటే చాలు శరీరం ఉత్తేజితమవుతుంది. మంచినీరు ఎక్కువ త్రాగడం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్‌కు దూరంగా ఉంచవచ్చు. వేసవిలో మంచినీటికి మించిన పానీయం వేరే లేదు. మనకు మార్కెట్‌లో లభించే వీటిని తిన్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
 
* పుచ్చకాయ: ఈ పుచ్చకాయ ప్రస్తుతం కాలంతో సంబంధం లేకుండా ఏ సీజన్‌లోనైనా అందుబాటులో ఉంటుంది. అయితే వేసవిలో మాత్రం దీనిని విరివిగా తింటారు. ఇందులో 80 శాతం కంటె ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.
 
* గ్రిల్డ్ వెజిటేబుల్స్: ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్, వెల్లుల్లి వంటి కూరగాయలను ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే తినాలి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎండల వల్ల వచ్చే చర్మవ్యాధుల నుండి రక్షిస్తాయి.
 
* సలాడ్స్: వేసవికాలంలో రకరకాల సలాడ్స్ తయారుచేసుకోవచ్చు. గ్రిల్డ్ వెజిటేబుల్స్, పన్నీర్ సలాడ్స్ వంటివి చేసుకోవచ్చు. అంతేకాకుండా దోసకాయ వంటి వాటితో చేసిన సూప్‌ను భోజనానికి ముందుగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది.
 
* ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిది. అంతేగాక చాలా సులభంగా జీర్ణమవుతుంది. అందువల్లనే వేసవికాలం వంటకాల తయారీలో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం మంచిది.
 
* వేపుళ్లు, కారం, మసాలాలను తినడం వీలైనంత వరకు తగ్గించాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వీలైనంత వరకు మాంసాహారాన్ని తీసుకోకపోవడం మంచిది. పీచు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తినడం ఉత్తమం.

అన్నీ చూడండి

Pawan Kalyan, తీవ్రమైన జ్వరం, మళ్లీ భుజం నొప్పి వచ్చిందా, హుటాహుటిన హైదరాబాద్‌కి పవన్

పిల్లల ఆన్‌లైన్ భద్రతకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక బలమైన సందేశం: చందన మారిపల్లి

హర్మూజ్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోలేరు : ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఉద్యోగ ఇంటర్వ్యూల్లో 90 శాతం అవినీతి : బాబా రాందేవ్

ప్రభుత్వాలు మారినా పాఠశాలల దుస్థితి మాత్రం మారడం లేదు : అభిజీత్ దీప్కే

అన్నీ చూడండి

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

అమీర్ లోగ్ చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపిస్తోంది : సాయి మార్తాండ్

తర్వాతి కథనం
Show comments