వేసవికాలం: కలబంద, కొబ్బరితో మేలెంతో తెలుసా?

వేసవి కాలం వచ్చేస్తోంది. వేసవిలో ఆహారం విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. అందుకే డైట్‌లో వీటిని చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కలబంద, కొబ్బరి బోండాంలను ఉపయోగిస్తే వేడి తీవ్రతను తగ్గించుకోవచ

సోమవారం, 5 మార్చి 2018 (16:23 IST)
వేసవి కాలం వచ్చేస్తోంది. వేసవిలో ఆహారం విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. అందుకే డైట్‌లో వీటిని చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కలబంద, కొబ్బరి బోండాంలను ఉపయోగిస్తే వేడి తీవ్రతను తగ్గించుకోవచ్చు.

కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఎండ వేడిమి నుంచి గట్టెక్కవచ్చు. కలబంద శరీర వేడి తాపాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని ఎండ నుంచి రక్షిస్తుంది. చెమటతో ఏర్పడే చర్మ సంబంధ సమస్యలను కలబంద దూరం చేస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు ఇది తోడ్పడుతుంది. 
 
అలాంటి కలబందను ఉపయోగించి.. వేసవి తాపాన్ని తగ్గించే పానీయాన్ని తగ్గించడం ఎలాగో చూద్దాం.. 
కావలసిన పదార్థాలు:
కలబంద గుజ్జు- అరకప్పు 
పెరుగు - పావు కప్పు 
ఉప్పు - తగినంత 
ఇంగువ - పావు టీ స్పూన్ 
కొత్తిమీర తరుగు- ఒక స్పూన్ 
 
తయారీ విధానం: కలబందను బాగా నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ గుజ్జును బౌల్‌లోకి తీసుకుని.. పావు కప్పు పెరుగును చేర్చాలి. ఆపై ఉప్పు, ఇంగువ పొడి, కొత్తిమీర పొడి చేర్చి మిక్సీలో రుబ్బుకోవాలి. ఆపై తగినంత నీటిని చేర్చి జ్యూస్‌లా తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు వేసవి కాలంలో వేడి తాపం తగ్గుతుంది. వేసవిలో కారంతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఏర్పడే అల్సర్‌ను.. కడుపులో మంటను ఇది దూరం చేస్తుంది. చర్మాన్ని సన్ టాన్ నుంచి కాపాడుతుంది. 
 
శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తుంది. తద్వారా డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా డీ-హైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. కొబ్బరి బోండాంతో పటికబెల్లం కలుపుకుని గంటకోసారి తీసుకుంటే నీరసం, అలసట దరిచేరదు. కొబ్బరినీటిలో వుండే మెగ్నీషియం, పొటాషియం డీహైడ్రేషన్‌ను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

ప్రేయసికి నిశ్చితార్థం.. వివాహిత ప్రియుడి బెదిరింపులు.. పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

అమరావతిపై కోర్టును ఆశ్రయించనున్న విజయ్ సాయి రెడ్డి.. సిగ్గు సిగ్గు.. అంటూ ఫైర్

హమ్మయ్య.. రుషికొండను అలా ఉపయోగించనున్న ఏపీ సర్కారు?

గిరిజన గ్రామంలో తాగు నీటి కొరత.. ఖాళీ బిందెలతో మహిళల నిరసన

ఉత్తరాదిన కుమ్మేస్తున్న భారీ వర్షాలు.. ముంబైలో మూడు రోజుల వర్షానికి నలుగురు మృతి

అన్నీ చూడండి

కామాఖ్య నుంచి హార్ట్ ఫుల్ మెలోడీ ఏముందో ఏమో సాంగ్ రిలీజ్

జయకృష్ణ ఘట్టమనేని శ్రీనివాస మంగాపురం విడుదల తేదీ ఖరారు

ఫస్ట్ డే నాగ బంధం, రావు బహదూర్ ఓపెనింగ్స్ రిపోర్ట్

Samantha recored: మా ఇంటి బంగారం తో బాక్సాఫీస్ రికార్డును అధిగమించిన సమంత రూత్ ప్రభు

Ntr: అఖిల్ అక్కినేని 'లనిన్ ట్రైలర్‌కు టాలీవుడ్ తారల మద్దతు

తర్వాతి కథనం
Show comments