మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2017 (11:14 IST)

స్వీట్ కార్న్ తింటే వార్ధక్య ఛాయలు రావట

స్వీట్ కార్న్ తినడం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్లు దూరం కావడంతో పాటు వార్ధక్య ఛాయలు రావని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో కెలోరీలు తక్కువ. పీచు, విటమిన్లు, యాంటీయాక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కంటి

స్వీట్ కార్న్ తినడం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్లు దూరం కావడంతో పాటు వార్ధక్య ఛాయలు రావని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో కెలోరీలు తక్కువ. పీచు, విటమిన్లు, యాంటీయాక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

కంటిచూపు వయసు పెరిగేకొద్దీ కంటి చూపు మందగించడంతో పాటు మరికొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటి ప్రభావాన్ని తగ్గించడంలో స్వీట్‌కార్న్ కీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే జియాగ్జాంథిన్‌ అనే ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్‌ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
స్వీట్ కార్న్‌లో పుష్కలంగా ఉండే ఫొలేట్ గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని థయామిన్ మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. స్వీట్‌కార్న్‌లోని ప్రత్యేకమైన బి విటమిన్లు, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఒక యాపిల్‌తో పోలిస్తే.. ఇందులో ఉండే తీపి శాతం తక్కువే. కాబట్టి మోతాదు మించకుండా వీటిని నిత్యం తీసుకోవచ్చు. స్వీట్‌కార్న్‌ తీసుకుంటే జీర్ణక్రియ తీరు మెరుగుపడుతుంది. అందుకు కారణం ఇందులో ఉండే పీచే. అలాగే మేలు చేసే బ్యాక్టీరియా కూడా పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.