Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ సమస్యతో బాధపడేవారు ఈ చిట్కాలు పాటిస్తే...

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 29 డిశెంబరు 2023 (23:34 IST)
చాలామంది గ్యాస్ సమస్యతో బాధపడుతుంటారు. కడుపు ఉబ్బ‌రం, ఛాతి నొప్పి తదితర సమస్యలు గ్యాస్ సమస్యతోనే వస్తుంటాయి. ఇలాంటి వారు మన వంటింట్లో అందుబాటులో ఉండేవాటితోనే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. గ్యాస్ సమస్య రావడానికి ప్రధాన కారణం వేళకు ఆహారం తీసుకోకపోవడం.
 
మలబద్దకం, పేగుల్లో సమస్య, మధుమేహం, కడుపులో అల్సర్లు, మితిమీరిన ఉపవాసాలు, అతిగా మద్యం సేవించడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి. గ్లాసు గోరువెచ్చని పాలలో దాల్చిన చెక్క, తేనేలను ఒక టీ స్పూన్ మోతాదులో కలుపుకుని తాగితే ఈ సమస్య నుంచి విముక్తిపొందవచ్చు. 
 
పుదీనా ఆకులను వేడినీటిలో మరగించి, ఒక టీ స్పూన్ తేనె కలుపుకుని తాగినట్టయితే గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. భోజనం చేసిన తర్వాత 2 టీ స్పూన్ల వాములో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకున్నట్టయితే గ్యాస్ సమస్యకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. జీలకర్ర లేదా వామును వేడి నీటిలో మరగించి అనంతరం వడకట్టి ఆ నీటిని తాగినట్టయితే గ్యాస్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. 

అన్నీ చూడండి

ఒక్కరోజు బిల్లు కట్టకపోయినా కట్ చేస్తున్నారుగా, కనెక్టివిటీ సరిగా లేదని జియో టెక్నీషియన్‌ని కట్టేసారు, వీడియో

ఏఐ డ్యాన్స్ వీడియో చూసి ఆశ్చర్యపోయిన కేరళ సీఎం .. విజయ్ కంటే నేనే బెస్ట్ డ్యాన్సరంటూ... (వీడియో)

లైంగికంగా వేధించాడని ఓ యువతి ఫిర్యాదు - 'ఢీ-10 డ్యాన్స్' షో విజేత అరెస్టు

9 కిలోల బరువుతో 45 ఏళ్లు బ్రతికే గరుడ పక్షి, వీడియో

వరుసగా 12 గంటల పాటు కూర్చోలేకపోతే, ఈ పదవుల్లో ఉండి ప్రయోజనం ఏమిటి?

అన్నీ చూడండి

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

Deepti Ghanta: నితిన్, దీప్తి గంట చిత్రం అలియాస్ రుక్మిణీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

తర్వాతి కథనం
Show comments