సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 మే 2024 (17:54 IST)

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

Orange
ఆరెంజ్ పండ్లను తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులోని ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. ఆరెంజ్‌లు డైటరీ ఫైబర్‌ కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. 
 
ఆరెంజ్‌లో అధిక నీటి కంటెంట్ ఉంటుంది, ఇది డిహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది. ఆరెంజ్‌లో అధిక విటమిన్ ఎ కంటెంట్ చూపును మెరుగుపరుస్తుంది. దృష్టిని మరింత మెరుగుపరుస్తుంది. ఆరెంజ్‌లోని విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. 
 
ఇది శరీరాన్ని అంటువ్యాధుల నుండి కాపాడుతుంది. ఆరెంజ్‌లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్‌తో సహా ఆరెంజ్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తక్కువగా కలిగి ఉంటాయి. నారింజలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. 
 
ఇది రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.