గురువారం, 28 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 16 మార్చి 2020 (21:51 IST)

శరీరానికి మంచినీటి ప్రాముఖ్యత ఏమిటి?

నీరు విత్తనం చెట్టుగా మారేందుకు సహాయపడుతుంది. అలాగే మన శరీరానికి కూడా సహాయపడుతుంది. నీరు కణాల లోపలా, బయటా ప్రవహించడంవల్ల శక్తి ఉత్పన్నమౌతుంది. అది శరీరంలో ఇతర రసాయన చర్యల ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తితో చేరుతుంది.
 
నీటి వల్ల కణాలలో ఉత్పత్తి అయ్యే శక్తి అవి నరాలలో వేగంగా దూసుకుపోయేలా చేస్తుంది. శరీరంలోని నీటిశాతం అంతరించిపోయిన ప్రొటీన్లు మరియు ఎంజైముల పనితీరుని ప్రభావితం చేస్తుంది. నీరు శరీరంలోని అంతర్గత అవయవాలు తేమను కలిగిఉండేందుకు సహకరస్తుంది. అదేవిధంగా రక్తం మరియు శోషరసాల వంటి ద్రవాలను సమతుల్యపరుస్తూ శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది.
 
అంతేకాదు, నీరు శరీరం నుంచి "టాక్సిన్స్"ని తొలగిస్తుంది. చర్మపు నిగారంపు మరియు పనితీరు మెరుగుపడాలంటే నీరు చాలా అవసరం. మనశరీరం రోజుకి దాదాపు నాలుగు లీటర్ల నీరు కోల్పోతుంది. కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే కనీసం దానికి సమానమైన మోతాదులో రోజూ నీళ్ళు త్రాగాలి. నీటిశాతం లోపిస్తే "డీహైడ్రేషన్"కి దారితీస్తుంది.