ఏటా జనవరి 23ను జాతీయ బాదం దినోత్సవంగా జరుపుకుంటారు. మన దైనందిన జీవితంలో బాదంను చేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఇది వెల్లడిస్తుంది. బాల్యం నుండి, మన అమ్మలు, అమ్మమ్మలు మన ఉదయం దినచర్యలో లేదా కనీసం రోజుకు ఒక్కసారైనా బాదంను మన ఆహారంతో పాటుగా తీసుకోమని ప్రోత్సహించారు. ఇప్పుడు 200 కంటే ఎక్కువ ప్రచురించబడిన శాస్త్రీయ అధ్యయనాలు, ఈ పురాతన జ్ఞానాన్ని మరింతగా పునరుద్ఘాటిస్తున్నాయి. ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న కాలిఫోర్నియా బాదం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని, మొత్తం శ్రేయస్సుకు దోహదం చేస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఈ ప్రత్యేక రోజున, న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో రీజినల్ హెడ్- డైటెటిక్స్ రితికా సమద్దర్, మీ రోజువారీ ఆహారంలో బాదం చేర్చుకోవడం వల్ల కలిగే కొన్ని తక్కువ తెలిసిన ఆరోగ్య ప్రయోజనాలను పంచుకుంటున్నారు. అవేమిటో ఒకసారి చూద్దాం!
కాలిఫోర్నియా బాదం, మెగ్నీషియం, ప్రోటీన్, రిబోఫ్లేవిన్, జింక్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మరిన్నింటితో సహా 15 ముఖ్యమైన పోషకాలకు మూలం. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యంకు దోహదం చేస్తాయి. వాస్తవానికి, భారతీయుల కోసం ICMR-NIN ఆహార మార్గదర్శకాలు కూడా బాదంను మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తినగల పోషకమైన గింజగా గుర్తించాయి.
విటమిన్ E (ఆల్ఫా-టోకోఫెరోల్) యొక్క గొప్ప మూలం, బాదం. ఇది ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి తోడ్పడుతుంది. దీనిలోని యాంటీ ఏజింగ్ లక్షణాలు దీనికి దోహదపడతాయి.
ప్రోటీన్ యొక్క గొప్ప మూలం, కాలిఫోర్నియా బాదం. ఇది కండర ద్రవ్యరాశి పెరుగుదల, నిర్వహణకు మద్దతు ఇచ్చే పోషకంగా నిలుస్తుంది. ICMR మార్గదర్శకాలు సమతుల్య ఆహారంలో భాగంగా బాదంలను క్రమం తప్పకుండా తీసుకోవడాన్ని ఆమోదిస్తాయి, మొక్కల ప్రోటీన్ యొక్క మూలంగా, ఆరోగ్యకరమైన చిరుతిండిగా దీనిని మలుస్తున్నాయి.
బాదంలో విటమిన్ B2, మెగ్నీషియం, భాస్వరం వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి, ఇవి ఆహారాన్ని శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి, మిమ్మల్ని చురుకుగా, శక్తివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
కొన్ని బాదం గింజలు, కడుపు నిండిన అనుభూతిని కలిగించటంలో సహాయపడతాయి, బరువు నిర్వహణకు మద్దతు ఇవ్వడానికి వాటిని ఒక స్మార్ట్ ఎంపికగా చేస్తాయి.
బాదంను సమతుల్య ఆహారంలో చేర్చినప్పుడు, మొత్తం మరియు LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయని తేలింది. అదనంగా, అవి మంటను తగ్గించడంలో సహాయపడతాయి, ఇది గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకమైన అంశం.
కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాల నుండి రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గించడంలో బాదం సహాయపడుతుంది, ఉపవాస ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర నిర్వహణను మెరుగుపరుస్తుంది.
సమతుల్య ఆహారంలో బాదంపప్పును క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని FSSAI వెల్లడించింది, సరైన ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించే శక్తివంతమైన పోషకాల మిశ్రమం బాదం.