కొబ్బరి బొండాలను కూడా కల్తీ చేస్తున్నారట

విజ‌య‌వాడ ‌: కాస్త వేడి చేసిందంటే చాలు కొబ్బ‌రి నీళ్ళు తాగుతాం. జ్వ‌రం వ‌చ్చినా, నీరసంగా ఉన్నా కొబ్బ‌రి బొండాలు కావాల్సిందే. ఏ కాలమైనా మేలు చేసేవి కొబ్బరినీళ్లు. సర్వరోగ నివారిణిగా పేరున్న కొబ్బరి నీళ్లొక్కటే కల్తీ లేకుండా మనకు దొరుకుతున్నాయని మన నమ్

బుధవారం, 12 అక్టోబరు 2016 (21:29 IST)
విజ‌య‌వాడ ‌: కాస్త వేడి చేసిందంటే చాలు కొబ్బ‌రి నీళ్ళు తాగుతాం. జ్వ‌రం వ‌చ్చినా, నీరసంగా ఉన్నా కొబ్బ‌రి బొండాలు కావాల్సిందే. ఏ కాలమైనా మేలు చేసేవి కొబ్బరినీళ్లు. సర్వరోగ నివారిణిగా పేరున్న కొబ్బరి నీళ్లొక్కటే కల్తీ లేకుండా మనకు దొరుకుతున్నాయని మన నమ్మకం. సీజన్‌ను బట్టి ఎంత ధర పెట్టి అయినా కొని తాగే కొబ్బరినీళ్లలో కూడా కల్తీ జరుగుతోందట. అదెలా సాధ్యం? త్వరితగతిన కొబ్బరి పిందెలు కొబ్బరి బొండాలుగా తయారుకావాలని.. వాటిని ఎగుమతి చేసుకోవాలనే తాపత్రయంలో వీటిని కూడా కల్తీ చేస్తున్నారట.
 
కొబ్బరి చెట్టు వేర్లు ఉన్నచోట తల్లి వేరును బయటకు తీసి దానిని అక్కడే కవర్లో పెట్టి దానిపై మోనోక్రోటోఫాస్ అనే కెమికల్‌ను పోసి ఆ తరువాత మట్టితో కప్పేస్తారట. ఇలా ఆ కెమికల్‌ను చెట్టుకు ఎక్కించడం ద్వారా పిందెలు త్వరితిగతిన బొండాలుగా మారతాయట. అలా తయారైన బొండాలు తాగితే గుండె, కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. చెట్టు నుంచి వాటి కెమికల్ పూర్తిగా నశించాలంటే 40 రోజులు పడుతుందట. సో.. మనం తాగుతున్న బొండాలు కూడా ఎంతవరకు సేఫ్? గ్యారంటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంతా మాయాప్ర‌పంచం... క‌ల్తీమ‌యం.

అన్నీ చూడండి

వరకట్న వేధింపుల కేసు.. ట్విషా శర్మ భర్త, అత్తకు కస్టడీ పొడిగింపు

నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

కేరళలో షిగెల్లా కేసులు.. జనవరి నుంచి 146.. జూన్‌లో మాత్రమే 70 కేసులు

జనసేనలో కొత్తగా సమన్వయ కమిటీ : పవన్ కళ్యాణ్

బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి ముకేశ్ అంబానీ భారీ విరాళం

అన్నీ చూడండి

కాంచన 4లో నటించనున్న లేడీ సూపర్ స్టార్ నయనతార?

Vishal: సీఎం విజయ్ చెప్పినట్లు చేశానంటున్న విశాల్

యూట్యూబర్ ఖలీద్‌తో బ్రేకప్ చెప్పేసిన నటి సునైనా?

Peddi Article: పెద్ది కలెక్లన్ల ద్వారా తెలుగు ఇంఢస్ట్రీ ఏం నేర్చుకుంది? ఇంకా ఏం నేర్చుకోవాలి?

శ్రీనగర్ యువతిని పెళ్లాడిన ఊర్మిళా మాటోండ్కర్ మాజీ భర్త

తర్వాతి కథనం
Show comments