శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 మే 2020 (18:22 IST)

లాక్‌డౌన్ ఎఫెక్టు : కండోమ్స్ - గర్భనిరోధక మాత్రలకు భలే డిమాండ్

కరోనా వైరస్ దెబ్బకు దేశం లాక్‌డౌన్‌లోకి ఉంది. దీంతో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లకే పరిమితమయ్యారు. పైగా, దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తమతమ కుటుంబ సభ్యుల చెంతకు చేరుకున్నారు. లాక్‌డౌన్ పుణ్యమాని భార్యలకు, భర్తలకు దూరంగా ఉంటూ వచ్చిన దంపతులు కూడా ఒక్కటయ్యాయి. ఇలాంటి వారంతా శృంగారంలో మునిగితేలుతున్నారు. ఈ కారణంగా దేశ వ్యాప్తంగా కండోమ్స్, గర్భనిరోధక మాత్రల కొరత ఏర్పడి, డిమాండ్ పెరిగిపోయింది. 
 
లాక్‌డౌన్‌తో కొన్ని వస్తువుల కొరత ఏర్పడినట్టుగానే ప్రధాన మెట్రో నగరాల్లో గర్శనిరోధక మాత్రల కొరత ఏర్పడింది. జనం నుంచి డిమాండ్ పెరగడంతో మెడికల్ షాపుల యజమానులు కూడా అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. అలాగే డాక్టర్ సిఫారసు లేకుండా ఈ మాత్రలు విక్రయిస్తున్నట్లు తెలియవచ్చింది.
 
దేశ వ్యాప్తంగా గర్భనిరోధక మాత్రలకు కూడా డిమాండ్ పెరిగిందని ఫార్మా కంపెనీలు తెలిపాయి. డిమాండ్ అధికంగా ఉండడంతో సఫ్లై పెరిగిందని చెబుతున్నాయి. అయితే మెడికల్ షాపుల్లో గర్భ నిరోధక మాత్రలు విక్రయిస్తున్న వివరాలు నమోదు చేయడం లేదని కొందరు డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
మెడికల్ షాపుల్లో ఇలాంటి మాత్రలు విక్రయించినప్పుడు ఎన్ని అమ్ముడుపోయాయో వాటి వివిరాలు నమోదు చేయాలి. అయితే అందుకు భిన్నంగా మెడికల్ షాపుల యజమానులు ఎంట్రీ చేయకుండా దాచిపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డాక్టర్ సలహా లేకుండా గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే అస్వస్థతకు గురయ్యే అకాశం ఉందని, ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.