Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీట్‌రూట్ రసాన్ని తాగేవారికి అది తగ్గిపోతుంది...

Written By సిహెచ్
Updated: మంగళవారం, 23 అక్టోబరు 2018 (20:59 IST)
బీట్‌రూట్‌ రసాన్ని తాగితే అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. కాబట్టి రోజూ 250 మి.గ్రా. పచ్చి బీట్‌రూట్‌ రసాన్ని తాగితే మేలు జరుగుతుంది. బీట్‌రూట్‌లో కేవలం నైట్రేట్లు మాత్రమే కాదు.. విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలూ దండిగా ఉంటాయి. శరీరం క్యాల్షియాన్ని వినియోగించుకోవటంలో తోడ్పడుతుంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది. దీనివలన కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. బీట్‌రూట్ డయాబెటిక్ సమస్యను ఎదుర్కొంటుంది. అలాగే లివర్‌ను కాపాడుతుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
 
2. మలబద్దకంతో బాధపడుతున్నవారు బీట్ రూట్‌ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
3. బీట్‌రూట్ రసంలో బోరాన్ ఎక్కువగా ఉన్నందు వలన శృంగార హోర్మోన్స్ ఎక్కువ చేస్తుంది.
 
4. బీట్‌రూట్‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్‌ ఆక్సైడ్‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
 
5. బీట్‌రూట్‌ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చనీ పరిశోధనలో తేలింది.
 
6. సౌందర్యానికి విటమిన్‌ బి దండిగా ఉండే బీట్‌రూట్‌... చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. వీటిల్లోని బీటేన్‌ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది.
 
7. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments