Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవ్వు కరిగిపోయేందుకు అద్భుతమైన చిట్కా...

Written By సిహెచ్
Updated: బుధవారం, 30 మార్చి 2022 (23:19 IST)
ఆవనూనెను వేడిచేసి, నాలుగవ వంతు కర్పూరాన్ని అందులో కరిగించి చల్లార్చి నిలువ ఉంచుకుని, తొడలు, ఉదరం మొదలైన భాగాల్లో మర్దనా చేస్తుంటే ఆయా భాగాల్లో సంచితమైన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. రొమ్ములపై గడ్డలున్న చోట మర్దనా చేస్తుంటే కొన్ని విధాలైనా గడ్డలు కరిగిపోతాయి.

 
పాదాలు, అరచేతుల చర్మం బిరుసెక్కి పగుళ్లతో బాధపడేవారు, కొబ్బరినూనెలో పసుపు, కర్పూరం కలిపి రంగరించి రాస్తుంటే చక్కటి ఫలితం ఉంటుంది. అరగ్లాసు కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు పంచదార, చిటికెడు కర్పూరం, చిటికెడు ఉప్పు కలిపి రెండు గంటలకు ఒకసారి సేవిస్తుంటే నీళ్ల విరేచనాలు, కలరా వ్యాధి తగ్గుతాయి. అంతేకాకుండా నీరసం, నిస్త్రాణ కూడా తగ్గుతాయి.

 
పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని తగినంత ఎండుద్రాక్ష కలిపి నూరి సెనగలంత మాత్రలు చేసుకుని రాత్రి నిద్రకు ముందు ఒక మాత్ర చొప్పున కప్పు పాలతో సేవిస్తుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్య తగ్గి శృంగార సామర్థ్యం పెరిగి, దాంపత్య సమయంలో సంతృప్తి కలగడమే కాక సంభోగం తరువాత నీరసం లేకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది.

 
మిరియాలు, కర్పూరం, నల్ల జీలకర్ర పొడి, ఏలుకల చూర్ణాలను సమానంగా కలిపి ముక్కుపొడుంలా పీలుస్తుంటే, ముక్కు, సైనస్ తదితరభాగాల్లో సంచితమైన శ్లేష్మమంతా సులువుగా బయటకు వెళ్లి ముక్కుదిబ్బడ, తలబరువు, తలనొప్పి వంటి బాధలు తగ్గుతాయి.
 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం