శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 14 డిశెంబరు 2018 (15:20 IST)

ఓట్స్ తింటుంటారు కానీ ప్రయోజనాలేమిటో తెలుసా?

ఓట్స్ మంచి పౌష్ఠికాహారం. దీనిలో పీచు పదార్థం, విటమిన్ బి-2, విటమిన్ సి ఎక్కువగా ఉన్నాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్స్ కూడా ఎక్కువే. పిల్లలకు ఆహారంలో ఓట్స్‌ను ఏదో ఒక రూపంలో ఇవ్వడం వల్ల మంచి పోషక విలువలు లభిస్తాయి. ఓట్స్‌తో రకరకాల రుచికరమైన తినుబండారాలు చేయవచ్చు సగం కప్పు ఉడికించిన ఓట్స్‌లో 80 కేలరీలు మాత్రమే ఉంటాయ. నీటిలో కరిగే పీచుతో పాటు కరగని పీచు కూడా వీటిలో ఉంటుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. ఓట్స్‌కి జిగురు గుణాన్ని తెచ్చిపెట్టే కరిగే పీచు రక్తంలోని కొలెస్ట్రాల్‌ను వేరుచేస్తూ.. దాన్ని తగ్గించటంలో తోడ్పడుతుంది. ఇన్ని పోషక విలువలు కలిగిన ఓట్స్ గురించి మరికొంత సమాచారం.
 
1. ఓట్స్‌ మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర మోతాదు హఠాత్తుగా పెరగకుండా చేస్తాయి. నెమ్మదిగా జీర్ణమవుతూ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి కాబట్టి మధుమేహం రాకుండానూ కాపాడతాయి.
 
2. ఓట్స్‌లో జింక్‌, విటమిన్‌ ఇ, సెలీనియం కూడా ఎక్కువగానే ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఓట్స్ మంచి ఆహారం. ఓట్స్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
 
3. అంతేగాక రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంచుతుంది. ఓట్స్‌లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. అందువల్ల గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది. 
 
4. ఓట్స్‌లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు ఓట్స్ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
5. ఓట్స్‌లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని ఆహారంలో బాగంగా చేర్చుకోవడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది.