deewali
✕

బేకింగ్ సోడా, నిమ్మరసంతో అందమైన దంతాలు..

Written By సందీప్
Updated: సోమవారం, 15 ఏప్రియల్ 2019 (17:58 IST)
ముఖానికి చిరునవ్వు అందం. మనం నవ్వేటప్పుడు పళ్లు కూడా అందంగా కనిపించాలి. పాచి లేదా గార కనిపిస్తే మనకే సిగ్గు అనిపిస్తుంది. చాలా మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా పళ్లపై వచ్చే నల్ల గారను పోగొట్టుకోలేరు. ఎన్నో టూత్ పేస్ట్‌లు, బ్రష్‌లు ఉపయోగించినా ప్రయోజనం ఉండదు. అంగట్లో దొరికే పదార్థాలకు బదులుగా మనం ఇంట్లోనే దానికి పరిష్కారం వెతుక్కోవచ్చు. 
 
బేకింగ్ సోడా, నిమ్మరసం ఉపయోగించి తెల్లని పళ్లను మన సొంతం చేసుకోవచ్చు. ఒక స్పూన్ బేకింగ్ సోడాలో సగం చెక్క నిమ్మరసం పిండి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని బ్రష్ చేస్తున్నట్లుగా వేలితో పళ్లపై నెమ్మదిగా రుద్దాలి. ఇలా మూడు నిమిషాలు చేసి నీటితో పుక్కిలించితే మీ పళ్లు తలతలా మెరిసిపోతాయి.
 
పిడికెడు తులసి ఆకులను నీడలో ఆరబెట్టి పొడిచేసి దానిని పళ్లకు రుద్దుకున్నా కూడా పచ్చటిగార పోయి దంతాలు మెరుస్తాయి. రోజూ ఉపయోగించే పేస్ట్‌కి తులసి పొడిని జోడించి పళ్లకు రుద్దినా ప్రయోజనం ఉంటుంది. ఉప్పులో నిమ్మరసం పిండి పళ్లు తోముకున్నా పచ్చదనం పోతుంది. లవంగాల పొడిని పేస్ట్‌లో కలిపి బ్రష్ చేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. పళ్లు పుచ్చిపోకుండా దృఢంగా కూడా ఉంటాయి.

అన్నీ చూడండి

నవంబర్ 8, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన

జనసేన ఎమ్మెల్యే సతీమణి ZPTC ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యే తిక్క కుదిరిందంటూ కామెంట్స్

గెలిచిన అభ్యర్థిని ఓడిపోయాడని చెప్పడం సాధ్యమేనా? రోజా ఆందోళన, ఈడ్చుకెళ్లిన పోలీసులు, వీడియో

పులివెందుల, మైదుకూరు జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ

రాహుల్‌ ఎదిగినా... కాంగ్రెస్‌ బలం తగ్గింది: వరుస ఎన్నికల ఓటములపై అమిత్‌షా విమర్శలు

అన్నీ చూడండి

Anushka Shetty Birth Day: అనుష్క శెట్టి 45వ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు

Naga Chaitanya: వృషకర్మ నుంచి స్వాగ్ అటిట్యూడ్‌తో ‘స్వాగ్ ఆఫ్ అర్జున్ రిలీజ్

Nithin look: అలియాస్ రుక్మిణి చిత్రం కోసం యవ్వనంతో కూడిన కృష్ణ పాత్రలో నితిన్

Sandiyar Kamal Haasan's birthday: కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా సండియర్ షూటింగ్ ప్రారంభం

జయంత్ అండ్ ది జింగో పెన్ ప్రతి విద్యార్థి చూడాల్సిన చిత్రం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

తర్వాతి కథనం
Show comments