బిర్యానీ ఆకుతో చుండ్రుకు చెక్ పెట్టండి.. శీతాకాలంలో ఆకుకూరలు తీసుకోండి..
బిర్యానీ ఆకుతో చుండ్రును సులభంగా దూరంగా చేసుకోవచ్చు. బిర్యానీ ఆకును నీటిలో కలిపి వేడి చేసి.. ఆ మిశ్రమాన్ని చల్లారాక జుట్టుకు అప్లై చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు జుట్టుకు అప్లై చేస్తే చుండ్రును తగ్
బిర్యానీ ఆకుతో చుండ్రును సులభంగా దూరంగా చేసుకోవచ్చు. బిర్యానీ ఆకును నీటిలో కలిపి వేడి చేసి.. ఆ మిశ్రమాన్ని చల్లారాక జుట్టుకు అప్లై చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు జుట్టుకు అప్లై చేస్తే చుండ్రును తగ్గించుకోవచ్చు. లేదంటే బిర్యాను ఆకును నీళ్ళలో నానబెట్టి పేస్టుగా చేసుకుని జుట్టుకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమం జుట్టు రాలటాన్ని తగ్గించి, వెంట్రుకలను మందంగా మారుస్తుంది. తలపై జుట్టు లేని ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేయటం వలన వీటిలో ఉండే ఎస్సేన్షియాల్ ఆయిల్‌లు, జుట్టు తిరిగి పెరిగేందుకు సాయపడతాయి.
ఇకపోతే.. శీతాకాలంలో కాఫీ తాగడం వల్ల కఫం పేరుకుంటుంది. ముక్కు దిబ్బడ వంటి సమస్యలు తలెత్తవచ్చు. కనుక కాఫీ, హెర్బల్ టీలకు దూరంగా ఉండండి. ఇంకా నీళ్లు ఎక్కువ తాగండి. ఆకుకూరలు అధికంగా తీసుకోండి. చేతులను శుభ్రంగా ఉంచుకోండి. అవసరమైతే మందులు వాడండి. ఉదయం వాకింగ్ చేయండి. త్వరగా నిద్రపోండి. శరీరానికి మాయిశ్చర్ అప్లై చేయండి. యోగా చేయండి. నూనె పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.