సంబంధిత వార్తలు
- సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్
- SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి
- Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి
- Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన
- క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case
Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?
hero Priyadarshi
ఇది పబ్లిసిటీలో భాగమైనా జనాలు నాని పై వున్న నమ్మకంతో థియేటర్లకు వచ్చారు. సక్సెస్ చేశారు. అయితే ఆ తర్వాత కథానాయకుడిగా నటించిన ప్రియదర్శి సినిమా సారంగపాణి జాతకంలో నటించాడు, ఇది శుక్రవారం విడుదలైంది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవమైన కలెక్షన్లతో ప్రారంభమైంది. రిలీజ్ రోజే థియేటర్లలో పెద్దగా స్పందనలేదు. కాకపోతే చూసినవారంతా బాగుంది. నవ్వుకున్నాం అన్నారు. అందుకు కారణం సపోర్ట్ యాక్టర్ వెన్నెల కిశోర్, వైవా హర్ష లు వుండడంతో ప్లస్ అయింది. కానీ ఇరగదీసే కలెక్లన్లు మాత్రం రాబట్టలేకపోయింది.
కారణం దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతలు సరికొత్తగా కథనాన్ని చూపించకపోవడమే. క్లయిమాక్స్ సీన్ చాలా సినిమాల్లో వున్నదే. హిందీ సినిమాల్లోనూ ఆ ఎపిసోడ్ వుంది. కనుక కథలు ఎంచుకునేటప్పుడు దర్శకుడుకానీ, హీరోగానీ జాగ్రత్తగా ఆలోచించాలి. కథనాన్ని మరింత కొత్తదనంతో చూపించాలి. అవి ప్రియదర్శికూడా ఆలోచించాలి. అన్నీ వెరైటీ కథలే ఎంచుకుంటున్నానని అన్నా, కొన్ని ప్రేక్షకులకు కనెక్ట్ కాలేవు. సో. ప్రియదర్శి హీరోగా సినిమాలు చేయానుకుంటే మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. సారంగపాణి.. చిత్ర ఇంటర్ వెల్ లో చూపించినట్లుగా సంకటం, సశేషం అన్నట్లుగా కాస్త హీరోగా గేప్ తీసుకోవాలేమో చూడాలి?
