శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 11 మే 2018 (13:31 IST)

కాకరకాయ రసంతో చక్కెర వ్యాధిని అడ్డుకోవచ్చు...

ప్రతి రోజూ కాకరకాయ రసం త్రాగితే మధుమేహం పారిపోతుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు. సాధారణంగా కాకరకాయ వంటకాలను తినడానికే కాసింత చక్కెర లేదా బెల్లం వేసి తయారు చేస్తుంటారు. అలాంటి కాకరకాయ రసం త్రాగడం అంటే

ప్రతి రోజూ కాకరకాయ రసం త్రాగితే మధుమేహం దరిచేరదని ఆయుర్వేద వైద్యులు చెపుతారు. సాధారణంగా కాకరకాయ వంటకాలను తినడానికే కాసింత చక్కెర లేదా బెల్లం వేసి తయారుచేస్తుంటారు. అలాంటి కాకరకాయ రసం త్రాగడం అంటే కాస్త కష్టంగానే ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో చక్కెర వ్యాధి (మధుమేహం) సర్వసాధారణ వ్యాధిగా మారిపోయింది. చక్కెర వ్యాధి ఒకసారి వచ్చిందంటే జీవితాంతం మందులు తినాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యాధికి కాకరకాయ రసంతో చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. 
 
ఈ రసం తాగడం వల్ల కొంతమందికి వాంతులయ్యే అవకాశం వుంటుంది. దీనికి కారణం అలవాటు లేని చేదు పదార్థాన్ని ఏకబిగిన గ్లాసెడు కాకర రసం త్రాగితే అది జీర్ణం కాక బయటికి వచ్చేస్తుంది. కాబట్టి తొలుత ఒకటి లేదా రెండు చెంచాల రసంతోనే మొదలు పెట్టాలి. 
 
ఆ తరువాత క్రమంగా మోతాదును పెంచుకుంటూ ఇతర మందులు లేకుండా కాకరకాయ రసాన్ని త్రాగుతూ వుంటే సరిపోతుంది. మధుమేహంతో బాధపడేవారికి ఇది చాలా మేలు చేస్తోంది.