శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (17:39 IST)

దంతాలు ఎందుకు పుచ్చిపోతాయి? (Video)

సాధారణంగా చాలా మందికి దంతాలు పుచ్చిపోతుంటాయి. పళ్లు అలా పుచ్చిపోవడం వల్ల కలిగే పంటి నొప్పి వర్ణనాతీతం. చాలా మంది ఈ పంటి నొప్పిని భరించలేరు. ఈ మాట చెప్పేవాళ్ళ కంటే.. పంటి నొప్పిని భరించే వాళ్లకే ఎక్కువ తెలుసు. అయితే, దంతాలు ఎందుకు పుచ్చిపోతాయో చాలా మందికి తెలియదు. 
 
ప్రతిరోజు సరిగా దంతాలను శుభ్రం చేయకపోవడం వల్లే పళ్లు పుచ్చపోతాయని భావిస్తారు. ఇదొక కారణం కావొచ్చు. కానీ, దంతాలు పుచ్చిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. అవేంటో తెలుసుకొని ముందుగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఈ బాధ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. 
 
అసలు దంతాలు పుచ్చిపోవడానికి కారణాలను పరిశీలిస్తే, 
* అలాగే, ఇష్టానుసారంగా చాక్లెట్లు ఆరగించేవాళ్ళలో కూడా దంతాలు సులభంగా పుచ్చుపడతాయి. 
* అన్నిటికంటే ముఖ్యంగా, విటమిన్ డి తక్కువవారిలో కీళ్ళ నొప్పులతో పాటు.. పళ్లు పుచ్చిపోతాయి. 
* శీతలపానీయాలు అధికంగా తాగడం. చ‌క్కెర శాతం ఎక్కువ‌గా ఉండే ఐస్‌క్రీంలు తినడం వల్ల దంతాలు సులభంగా పుచ్చిపోతాయి. 
 
* డీ హైడ్రేష‌న్ వ‌ల్ల శ‌రీరం ఎండిపోవ‌డ‌మేకాకుండా నోరు కూడా ఎండిపోతుంది. ఇలానే ఎక్కుసేపు ఉండ‌డం వ‌ల్ల కూడా దంతాలు పుచ్చిపోతాయి. 
* దంతాలు పుచ్చిపోవడానికి జీర్ణ సమస్యలు కూడా ఓ కారణం చెబుతున్నారు. సాధారణంగా జీర్ణ సమస్యలు ఉంటే.. గుండెల్లో మంట ఏర్పడుతుంది. దీనికి దంతాలు పుచ్చిపోవడం అదనం.