శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 29 ఏప్రియల్ 2020 (20:19 IST)

కోవిడ్-19, నాడీ వ్యవస్థపైన కూడా ప్రభావం చూపుతుందా? ఎలా?

కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. శాస్త్రవేత్తలు ఈ వైరస్ గురుంచి ప్రతి అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేసే వైరస్ మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా లక్షలకు చేరుకుంది. చైనా నగరమైన వుహాన్‌లో ప్రారంభమైన ఈ వైరస్ మానవ శరీరంలోని వివిధ భాగాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందన్న దానిపై శాస్త్రవేత్తలు పరిశోధించారు. 
 
ఇటీవల, చైనా కరోనా వైరస్ మనిషి మెదడుపై దాని ప్రభావం ఎలా వుంటుందన్న దానిపై అధ్యయనం చేసింది. కరోనా నాడీ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో కూడా అధ్యయం చేశారు. ఈ అధ్యయన నివేదికలో ఏమి వచ్చింది? కరోనా నిజంగా మానవ మనస్సు మరియు నాడీ వ్యవస్థపై దాడి చేస్తుందా?
 
సార్స్CoV-2 సోకిన వ్యక్తులు లక్షణాలు పూర్తి స్పెక్ట్రం ఇంకా అభివృద్ధి చేయబడలేదు. COVID-19 రోగులలో గమనించిన నాడీ లక్షణాలను ఇటీవలి పరిశోధనలు అధ్యయనం చేశాయి. రోగులలో నాడీ వ్యవస్థ యొక్క రుగ్మతకు కరోనా ప్రభావం ఎలా వుంటుందో పరీక్ష చేయడం జరిగింది.
 
వుహాన్‌లో ఆసుపత్రిలో చేరిన COVID-19 రోగులపై ఈ అధ్యయనం జరిగింది. పరిశోధనలో ఈ వ్యాధిలోని న్యూరోలాజికల్ మ్యుటేషన్లపై పరిశోధకులు దృష్టి సారించారు. పరిశోధకుల పరిశోధనలు చైనాకు చెందిన ప్రముఖ న్యూరాలజీ జర్నల్ జామాలో కూడా ప్రచురించబడ్డాయి. రోగిలో కోవిడ్ 19 యొక్క కొంత మొత్తంలో నాడీ లక్షణాలు పరిశోధకులు కనుగొన్నారు.
 
పరిశోధకులు కరోనా రోగులను 16 జనవరి 2020 నుండి 20 ఫిబ్రవరి 2020 వరకు అధ్యయనం చేశారు. అందులో పరిశోధకులు కనుగొన్నదేమిటంటే... రోగులలో 36.4% కంటే ఎక్కువ మందిలో, జ్వరం-దగ్గు కంటే కరోనా యొక్క సాధారణ లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని కనుగొనబడింది.
 
అంతేకాదు న్యూరోలాజికల్ లక్షణాలు కనబడ్డాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్న రోగులలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. పరిశోధకులు ఈ లక్షణాలను మూడు విధాలుగా వర్గీకరించారు. కేంద్ర నాడీ వ్యవస్థపై దాని మొదటి ప్రభావం మైకంగా వుండటం ఒక లక్షణం, తలనొప్పి, స్పృహ కోల్పోవడం, తీవ్రమైన మెదడు వ్యాధి, అటాక్సియా (శరీర కార్యకలాపాలన్నిటిపై మనస్సు నియంత్రణ కోల్పోయే లక్షణాలు) అలాగే ఒత్తిడి.
 
రెండవ వర్గం పరిధీయ నాడీ వ్యవస్థ. ఇందులో రోగి రుచిని కోల్పోతాడు. వాసన కోల్పోవడం, దృష్టి కోల్పోవడం, నాడుల నొప్పి వంటివి వీటిలో ఉన్నాయి. మూడవ విభాగంలో, కండరాల గాయాలపై అధ్యయనం చేయబడింది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కేసులలో ఇలాంటి గాయాలకు కారణం కరోనా అని స్పష్టంగా చూపించింది. ఇది మనిషి మెదడుపై కూడా ప్రభావితం చేస్తుంది.
పరిశోధకులు 214 మంది రోగులపై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో, 126 మందికి తీవ్రంగా వ్యాధి సోకలేదు, 88 మంది రోగులు తీవ్రంగా వ్యాధి బారిన పడ్డారు, మొత్తం 78 మంది రోగులలో కోవిడ్-19 ప్రభావం నాడీ సంబంధ సమస్యలు ఎదుర్కొన్నట్లు అధ్యయనం కనుగొంది.
 
ఈ ప్రభావం తీవ్రమైన కేసులలో ఎక్కువగా కనబడుతుందని గమనించాలి. ఈ రోగులకు కరోనా జలుబు, జ్వరం యొక్క సాధారణ లక్షణాల కంటే అధిక బిపి మొదలైన లక్షణాలు ఉన్నట్లు కనుగొనబడింది. వారికి తీవ్రమైన సెరెబ్రోవాస్కులర్ వ్యాధి, స్పృహ కోల్పోవడం మరియు స్కెలెటెన్ కండరాలకు గాయాలు అయినట్లు కనుగొనబడింది.
 
దీన్ని దృష్టిలో పెట్టుకుని, COVID-19 ఉన్న రోగులకు వారి నాడీ వ్యక్తీకరణలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అని పరిశోధకులు సూచించారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్న రోగులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. జ్వరం-దగ్గుకు బదులుగా రోగికి అధిక బిపి లేదా పైన పేర్కొన్న లక్షణాలు ఏదైనా ఉన్నప్పటికీ, కరోనా వైరస్‌ను తప్పక తనిఖీ చేయాలి. ఎందుకంటే చైనాలో అనారోగ్య రోగులలో ఈ లక్షణాలు కనిపించాయి. అందుకే ఈ కోణంలోనూ రోగులను పరీక్షించాలని అంటున్నారు.