శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2020 (18:08 IST)

చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వాడొద్దు ... ఐసీఎంఆర్ ఆదేశాలు

కరోనా వైరస్ నిర్ధారణ కోసం చైనా నుంచి కిట్లను కేంద్రం దిగుమతి చేసుకుంది. అయితే, చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వాడొద్దని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా, ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్టులు ఖచ్చితత్వంపై రాష్ట్రాలు సందేహాలు వస్తున్నాయి. 
 
ఇదే అంశంపై ఐసీఎంఆర్ ఒక ప్రకటన విడుదల చేసింది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న కిట్లతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయొద్దని కోరారు. అలాగే, ర్యాపిడ్ టెస్టుల కొనుగోళ్లు నిలిపివేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఇప్పటికే డెలివరీ తీసుకున్న వాటిని కూడా చైనా కంపెనీలకు వెనక్కు ఇచ్చేయాలని రాష్ట్రాలకు సూచన చేసింది. 
 
టెస్టుల ఖచ్చితత్వంపై వచ్చిన ఫిర్యాదులను అధ్యయనం చేసిన ఐసీఎంఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ర్యాపిడ్ టెస్టుల ద్వారా వచ్చే ఫలితాల్లో భారీ తేడాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ ఒక్క కారణంగానే ఈ పరీక్షలను నిలిపివేయాలని కోరింది. 
 
చైనా కంపెనీలు తొలుత ఇచ్చిన హామీకి విరుద్ధమైన ఫలితాలు వస్తున్నయాని అంగీకరించింది. కాగా, చైనాకు చెందిన వాండ్‌ఫోం బయోటెక్, లివ్‌జాన్ డయాగ్నస్టిక్ కంపెనీల నుంచి రాష్ట్రాలు ఈ కిట్లను దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే.