ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: గురువారం, 3 ఆగస్టు 2017 (16:35 IST)

జీవితంలో ఒక్కసారి కూడా లివర్ సమస్య రాకూడదంటే...

మనింట్లో సాధారణంగా వాడే జీలకర్రలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. జీలకర్రను ఉపయోగిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. జీలకర్ర జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో ఎంతగానో దోహదపడుతుంది. అలాగే యాంటీ సెప్టిక్ గాను పనిచేస్తుంది. జ

మనింట్లో సాధారణంగా వాడే జీలకర్రలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. జీలకర్రను ఉపయోగిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. జీలకర్ర జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో ఎంతగానో దోహదపడుతుంది. అలాగే యాంటీ సెప్టిక్ గాను పనిచేస్తుంది. జీలకర్రలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే లివర్‌కు బలం చేకూరుతుంది.
 
అజీర్తి, విరోచనాలు, వాంతులు వీటన్నింటి నుంచి జీలకర్ర ఉపశమనం ఇస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర రసం వేసి మరిగిస్తే జీలకర్ర టీ తయారవుతుంది. ఈ టీని ఉదయం పూట సేవిస్తే ఎంతో మంచిది. బాగా గొంతునొప్పి, జలుబు ఉంటే ఈ టీని తీసుకోవాలి. జీలకర్ర రసాన్ని రెగ్యులర్ తాగితే శరీరంలో వేడి పెరిగి మెటిబాలిజం రేటు పెరుగుతంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి కిడ్నీ, లివర్ జబ్బులు అస్సలు రావని వైద్య నిపుణులు చెపుతున్నారు.