మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 12 జనవరి 2017 (19:49 IST)

పంటి నొప్పికి వెల్లుల్లి -సాల్ట్ పేస్టు దివ్యౌషధం..

పంటి నొప్పి వేధిస్తుందా? ఈ టిప్స్ పాటించండి. ఎన్నో గుణాలు కలిగిన లవంగాన్ని పొడి చేయాలి. ఇందులో ఆలీవ్ లేదా వెజిటెబుల్ ఆయిల్ కలపాలి. నొప్పిగా ఉన్న పంటిపై ఈ పేస్టు పెట్టండి. అలాగే ఉప్పు, మిరియాల పొడిని స

పంటి నొప్పి వేధిస్తుందా? ఈ టిప్స్ పాటించండి. ఎన్నో గుణాలు కలిగిన లవంగాన్ని పొడి చేయాలి. ఇందులో ఆలీవ్ లేదా వెజిటెబుల్ ఆయిల్ కలపాలి. నొప్పిగా ఉన్న పంటిపై ఈ పేస్టు పెట్టండి. అలాగే ఉప్పు, మిరియాల పొడిని సమానంగా తీసుకోవాలి. కొంచెం నీటితో బాగా కలపాలి. ఈ పేస్టును నొప్పిగా ఉండే పంటిపై డైరెక్టుగా అప్లై చేయాలి.

కొన్ని నిమిషాల పాటు వదిలేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే పంటినొప్పి తగ్గుతుంది. ఒక రెబ్బ వెల్లుల్లిని తీసుకుని దీనిని మెత్తగా చేయాలి. దీనికి టేబుల్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ కలపాలి. అనంతరం నొప్పిగా ఉన్న పంటిపై అప్లై చేయాలి. 
 
పచ్చి ఉల్లిపాయ తీసుకుని కొన్ని నిమిషాటు నమలండి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. నమలడం ఇష్టం లేకపోతే ఉల్లి ముక్క తీసుకుని నొప్పి ఉన్న పంటిపై పెట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.