కరెంట్ కట్ తర్వాత ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం తీసుకోవచ్చా..?

మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (17:59 IST)
కరెంట్ పోయిన తర్వాత ఫ్రిజ్‌లో నిల్వ చేసి వుంచిన ఆహారం తీసుకోవచ్చా.. అనే ప్రశ్నకు న్యూట్రీషన్లు ఏమంటున్నారంటే.. కూరగాయలు, పండ్లు, ఉడికించిన ఆహారాన్ని ఒక్క రోజు మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి. అనేక రోజులు అలాగే ఉంచి వేడి చేసి తినడం అనారోగ్యానికి దారితీస్తుంది. 
 
అలాగే పవర్ కట్‌తో చల్లదనం కోల్పోయే ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా సులువుగా వ్యాపిస్తుంది. మళ్లీ పవర్ వచ్చినా ఆ ఆహారంలో నాణ్యత కోల్పోతుంది. ముఖ్యంగా మాంసాహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచడాన్ని తగ్గించండి. నాన్ వెజ్‌లో వచ్చే బ్యాక్టీరియాలు ఉదర సంబంధిత రోగాలకు దారి తీస్తుంది.
 
అలాగే కూరగాయల్ని కట్ చేసి అలానే ఉంచకుండా ఒక కవర్లో భద్రపరచి ఉంచడం మేలు. ఏ వస్తువునైనా ఒకరోజుకు పైగా ఫ్రిజ్‌లో ఉంచకండి. ఇడ్లీ పిండి వారాల పాటు ఫ్రిజ్‌లో ఉంచకండి. 48 గంటల్లోపే ఉపయోగించండి. 
 
ఫ్రిజ్‌లో నుంచి తీసిన పదార్థాలను వేడిచేసి మళ్లీ దానిని ఫ్రిజ్‌లో పెట్టకుండా చూసుకోండి. వీటికన్నింటికీ పరిష్కారం కావాలంటే మితంగా వండుకుని తినడం ఫ్రిజ్‌ను తక్కువగా వాడటం ఎంతో మేలని న్యూట్రీషన్లు అంటున్నారు. 

అన్నీ చూడండి

భర్త ICUలో వుంటే వెకిలిగా నవ్వుతూ రీల్స్ చేసిన భార్య, వీడియో వైరల్

ముద్రగడ అంత్యక్రియలు: గౌరవ వందనం చేస్తున్న పోలీసులను తోసేసిన అంబటి, వీడియో

ముద్రగడ పద్మనాభం మృతి... ప్రభుత్వ అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబీకులు

ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జ్ చేస్తుండగా మంటలు... ఇద్దరు మృతి

పెళ్లి సంబంధం చూస్తున్నారని గుండు చేయించుకున్న యువతి, వీడియో

అన్నీ చూడండి

Ruthvik: అబ్బాయిగా, అమ్మాయిగానూ నటించా, ఆ సినిమా చూసి నాట్యం నేర్చుకున్నా : రుత్విక్

Kiran Abbavaram: ఒడిదొడుకులు చూశా. ఇలాంటి మంచి సినిమాల కోసమే నిత్యం ప్రయత్నిస్తున్నా: కిరణ్ అబ్బవరం

Thalapathy: ముగిసిన దళపతి విజయ్ జ‌న నాయ‌గ‌న్‌ నిరీక్ష‌ణ‌.. జూలై 23న గ్రాండ్ రిలీజ్

నాగవంశీ ఆవిష్కరించిన అనకాపల్లి’ నుంచి ‘ఎలగే పిల్ల’ రొమాంటిక్ సాంగ్

వినాయక్ గారికి, V N ఆదిత్య ప్రారంభించిన కరుణామయ చిత్రం

Show comments