శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 మే 2017 (16:35 IST)

ఎముకలకు బలాన్నిచ్చే బీన్స్.. మధుమేహగ్రస్తులు ఓ కప్పు తీసుకుంటే?

ఎముకలకు బలం కావాలంటే.. బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బీన్స్‌లో విటమిన్ బీ6, థయామిన్, విటమిన్ సి ఉండటం ద్వారా శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అంతేగాకుండా.. ఎ

ఎముకలకు బలం కావాలంటే.. బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బీన్స్‌లో విటమిన్ బీ6, థయామిన్, విటమిన్ సి ఉండటం ద్వారా శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అంతేగాకుండా.. ఎముకలకు బలం పొందవచ్చు. ఇంకా బీన్స్‌లో క్యాన్సర్ కారకాలపై పోరాడే ధాతువులు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని ఫ్లేవనాయిడ్స్.. క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి. క్యాన్సర్ రాకుండా నియంత్రిస్తాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. 
 
బీన్స్‌ను వారానికి రెండు రోజులు తీసుకుంటే మధుమేహం దరిచేరదు. బీన్స్‌లో పీచు, విటమిన్ ఎ, బీ, కే, ఫోలేట్, మేగ్నిషియం వంటివి వుండటం ద్వారా రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వాయు సంబంధిత రోగాలను దూరం చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు ఒక కప్పు బీన్స్ తీసుకుంటే.. వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చు.