శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 28 సెప్టెంబరు 2019 (19:48 IST)

జుట్టు రాలిపోతుందా? యష్టిమధు చాలా బెస్టు...

చాలామంది జుట్టు రాలిపోయే సమస్యను ఎదుర్కుంటూ వుంటారు. జుట్టు రాలడాన్ని ఎంత నిరోధించాలన్నా వల్లకాదు. ఎన్నో మందులు వాడినా ఫలితం మాత్రం వుండదు. ఐతే యష్టిమధుతో జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు. ఇది జుట్టుకు ఔషధంలా పనిచేస్తుంది. 
 
గ్లాసు నీటిలో నాలుగు లేదా ఐదు చెంచాల యష్టిమధు చూర్ణం వేసి సగం నీరు ఆవిరైపోయేలా మరిగించాలి. మిగిలిన దానిని మెత్తని వస్త్రంలో వడబోసి వుంచుకోవాలి. తలస్నానం చేసేటపుడు ఆఖరి మగ్గు నీళ్లు పోసే ముందు తలను ఈ కషాయంతో తడపాలి. రెండు నిమిషాలు ఆరిన తర్వాత చివరి మగ్గు నీటిని తలపై పోసుకుంటే సరిపోతుంది. జట్టు రాలడం తగ్గిపోతుంది.