శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: బుధవారం, 7 డిశెంబరు 2016 (15:32 IST)

భోజనం ఇలా చేస్తే ఆరోగ్యం... తెలుసుకోండి...

చాలామందికి అసలు భోజనం ఎలా చేయాలో తెలియదు. అంటే, తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఐతే భోజనం ఎలా చేయాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భోజనం చేసే సమయంలో కడుపును నాలుగు భాగాలుగా ఊహించుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మహిళలు ఆహారం తీసుకునేటప్పుడు కడుపును న

చాలామందికి అసలు భోజనం ఎలా చేయాలో తెలియదు. అంటే, తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఐతే భోజనం ఎలా చేయాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భోజనం చేసే సమయంలో కడుపును నాలుగు భాగాలుగా ఊహించుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మహిళలు ఆహారం తీసుకునేటప్పుడు కడుపును నాలుగు భాగాలుగా భావించి రెండు భాగాలను ఘనపదార్థాలకూ, ఒక భాగం ద్రవపదార్థాలకు, మిగతా మరో భాగాన్ని వాయువుకు విడవాలి. ఈ నిష్పత్తిలో భోజనం చేయడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం. 
 
అయితే పెరుగును తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. కేవలం పెరుగును మాత్రమే తినకూడదు. పెరుగు తినదలచినవారు అందులో కొద్దిగా తేనెనుగాని, ఉసిరిక కలుపుకుని తినాలి. పెరుగును యథాతథంగా రాత్రిపూట తినడం నిషిద్ధం. పెరుగు గుణం వల్ల వాపును, కఫాన్ని పెంచుతుంది. అదే మజ్జిగ ఆ ప్రభావాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.